ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: సూపర్ సిక్స్‌తో అందరికీ న్యాయం చేస్తా

ABN, Publish Date - Dec 30 , 2023 | 09:06 PM

సూపర్ సిక్స్ పథకం అమలు చేసి అందరికీ న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) తెలిపారు. శనివారం నాడు కుప్పం మండలం మల్లానూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ...‘‘వంద రోజుల్లో కుప్పంలో 8వ సారి ఎన్నుకోబోతున్నారు. మూడు రోజుల పర్యటన చూస్తుంటే లక్ష ఓట్లు మెజార్టీ సాధ్యమేనని తెలుస్తోంది. ఈ ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో చీకటిని వైసీపీ నింపింది’’ అని చంద్రబాబు తెలిపారు.

చిత్తూరు: సూపర్ సిక్స్ పథకం అమలు చేసి అందరికీ న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) తెలిపారు. శనివారం నాడు కుప్పం మండలం మల్లానూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ...‘‘వంద రోజుల్లో కుప్పంలో 8వ సారి ఎన్నుకోబోతున్నారు. మూడు రోజుల పర్యటన చూస్తుంటే లక్ష ఓట్లు మెజార్టీ సాధ్యమేనని తెలుస్తోంది. ఈ ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో చీకటిని వైసీపీ నింపింది. పనికి మాలిన దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ. కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శంగా చేస్తాను. వైసీపీ పాలనలో ఊరికో సైకో, రౌడీ తయారు అవుతున్నారు. సీఎం జగన్ ఇచ్చేది 10 రూపాయలు దోచుకునేది 100 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నే అబద్దాలే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంఘటనను ఒక కేస్ స్టడీగా తీసుకుంటే అన్ని తెలుస్తుంది. సీఎం జగన్ చేసేవి అన్ని డ్రామాలు. ఊసరవెల్లి రాజకీయాలు’’ అని చంద్రబాబు సెటైర్లు వేశారు.


కొత్త భూ చట్టంతో నష్టం

‘‘వివేకానందరెడ్డి కుమార్తె పై అభాండాలు వేశారు. సీఎం జగన్ తన తమ్ముడు అవినాష్‌రెడ్డిని కాపాడే చర్యలు చేపట్టారు. హత్యే చేసిన వారిని తన పక్కనే పెట్టుకుని నేరం చేయని వారిపైనే కేసులు పెడుతున్నాడు.. ఇంతటి దారుణం ఎప్పుడు చూడలేదు. ప్రజల భూముల ఆస్తులు కొట్టేయాడనికి కొత్త భూమి చట్టం తీసుకుని వచ్చారు. కొత్త భూ చట్టంతో ప్రజల ఆస్తులు కొట్టేసి మనల్ని బానిసలుగా చేస్తారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తే మన మరణాన్ని మనమే రాసుకున్నట్టు అవుతుంది. జగన్ పాలనలో భూ ఆక్రమనలు, భూదందాలు పెరిగాయి. కాగా.. ప్రసంగం మధ్యలో అంబులెన్స్‌కు దారి కల్పించిన చంద్రబాబు. రైతును రాజుగా చేస్తాను. కుప్పం నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్‌గా చేస్తాను. విద్య, ఉద్యో, పరిశ్రమలు, యువతకు అవకాశాలు కల్పిస్తాను. ప్రపంచాన్ని కుప్పంకి అనుసంధానం చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తాను. బీసీ కులాలను ఆదుకునే కార్యక్రమలు చేపడతాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

కుప్పంకు మంత్రి పెద్దిరెడ్డి ఇక్కడి ప్రకృతి సంపదను దోచుకోడానికే...

‘‘యువత అభివృద్ధి కోసం నవశకం తయారు చేయడమే టీడీపీ లక్ష్యం. మల్లానూరు, రాళ్ల బూదు గూరు కొత్త మండల ఏర్పాటు చేస్తాను. కొత్త పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తాను. సీఎం జగన్ పని అయి పోయింది. ఎమ్మెల్యేలు తిరగపడ్డారు. వైసీపీ మునిగి పోయే నావ అయ్యింది. ఆ పార్టీ నాయకులతో సహా వైసీపీలో ఎవ్వరూ బాగు పడలేదు. నా వారసత్వం కుప్పం ప్రజలు. అందుకే పోరాడుతున్నాను. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. కుప్పంకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తున్నది కప్పం కోసమే. ఇక్కడి ప్రకృతి సంపదను దోచుకోవడానికి కుప్పంకు పెద్దిరెడ్డి వస్తున్నారు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో సైకోను శాశ్వతంగా ఇంటికి పంపాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated Date - Dec 30 , 2023 | 09:06 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising