ధర లేదు... దిగుబడీ లేదు!

ABN , First Publish Date - 2023-04-21T01:29:24+05:30 IST

ఈసారి జీడిమామిడి రైతుకు నష్టాల ఎదురీత తప్పడం లేదు. ఎన్నడూ లేనివిధంగా పంట దిగుబడి భారీగా తగ్గిపోగా, రేటు కూడా పడిపోయింది. దీంతో రైతులు నష్టపోతున్నారు.

ధర లేదు... దిగుబడీ లేదు!

గత సంవత్సరం బస్తా రేటు రూ.10 వేలు

ఈ సంవత్సరం బస్తా రేటు రూ.6,500

ఎకరానికి 3 నుంచి 4 బస్తాల దిగుబడి

జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో సాగు

నష్టాలు తప్పవంటున్న రైతులు

ఇలా అయితే తోటలు తొలగించాల్సిందే

ఈసారి జీడిమామిడి రైతుకు నష్టాల ఎదురీత తప్పడం లేదు. ఎన్నడూ లేనివిధంగా పంట దిగుబడి భారీగా తగ్గిపోగా, రేటు కూడా పడిపోయింది. దీంతో రైతులు నష్టపోతున్నారు.

గండేపల్లి, ఏప్రిల్‌ 20: ఒకపక్క దిగుబడి పూర్తిగా తగ్గడం, మరోపక్క గిట్టుబాటు ధర లేకపోవడంతో జీడిమామిడి రైతులు నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నా రు. గత సంవత్సరం జీడిమామిడి పిక్కల ధర బస్తా రూ.10 వేల నుంచి రూ.11 వేల వరకు ధర పలికింది. ఎకరానికి 10 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని రైతులు చెబు తున్నారు. కానీ ఈ సంవత్సరం ఎకరానికి 3 నుంచి 4 బస్తాలు రావడం లేదని.. ధర కూడా రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పడిపోయినందున రైతులకు నష్టాలు తప్పే టట్టు లేవని ఆందోళన చెందుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వానం. ఎకరా నికి రూ.20 వేల కౌలుకు తీసుకుని మరో రూ.30 వేల పెట్టుబడి పెట్టామని కౌలు రైతులు అంటున్నారు. గత రెండేళ్ల నుంచి పెద్దగా లాభాలు రాకపోయినా నష్టం రాలేదని, ఈ సంవత్సరమైనా లాభాలు వస్తాయని ఆశించినప్పటికీ ధర, దిగుబడి రెండూ లేకపోవడంతో ఎకరానికి రూ.25 వేల నష్టం వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అటు వాతావరణంతోపాటు పచ్చి జీడిపిక్కలు ఉన్న సమయంలో పిచ్చుకలు లోపల పిక్కలను తినేయడంతో దిగుబడి తగ్గడానికి కారణమంటున్నారు. మండలంలో 2 వేల ఎకరాల్లో, జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.

Updated Date - 2023-04-21T01:29:24+05:30 IST