Mahanadu Nara Lokesh: నారా లోకేష్ మహానాడు ప్రాంగణానికి చేరుకోగానే..!

ABN , First Publish Date - 2023-05-27T11:12:19+05:30 IST

ప్రతినిధుల నమోదు కార్యక్రమం దగ్గర ఘంటా శ్రీనివాస్‌.. లోకేష్ పలకరించుకున్నారు. అలాగే తెలుగు దేశం కార్యకర్తలు.. లోకేష్‌తో సెల్పీలు తీసుకునేందుకు

Mahanadu Nara Lokesh: నారా లోకేష్ మహానాడు ప్రాంగణానికి చేరుకోగానే..!
Mahanadu Nara Lokesh

రాజమండ్రి: రాజమండ్రిలో పసుపు పండుగ ప్రారంభమైంది. రెండ్రోజుల పాటు జరగనున్న మహానాడు కార్యక్రమం (Mahanadu) గ్రాండ్‌గా ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణానికి చేరుకుని చిత్తూరు జిల్లా కౌంటర్‌లో ప్రతినిధిగా పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడును చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్ స్టాళ్లను కూడా టీడీపీ అధినేత ప్రారంభించారు.

ఇక మహానాడు ప్రాంగణమంతా కార్యకర్తలు, అభిమానుల రాకతో కళకళలాడుతోంది. ఇంకోవైపు పార్టీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో నగరమంతా పసుపుమయంగా మారింది.

ఇదిలా ఉంటే మహానాడు ప్రాంగణానికి నారా లోకేష్ (Nara Lokesh) చేరుకోగానే కార్యకర్తలు, అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. లోకేష్ రాకతో మహానాడు ప్రాంతమంతా సందడి.. సందడిగా మారిపోయింది. ఇంకోవైపు పార్టీ ప్రతినిధులకు అభివాదం చేసుకుంటూ.. అందర్నీ పలకరించుకుంటూ లోకేష్ స్టేజీపైకి చేరుకున్నారు. ప్రతినిధుల నమోదు కార్యక్రమం దగ్గర ఘంటా శ్రీనివాస్‌.. లోకేష్ పలకరించుకున్నారు. అలాగే తెలుగు దేశం కార్యకర్తలు.. లోకేష్‌తో సెల్పీలు తీసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. ఇక ‘జనహృదయమై నారా లోకేష్’ అంటూ యువగళం పాదయాత్రపై కేశినేని చిన్ని ముద్రించిన పుస్తకంపై పార్టీ కార్యకర్తల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పాదయాత్రతో మంచి జోష్ వచ్చిందంటూ కార్యకర్తలు లోకేష్‌కు తెలియజేశారు. ఇక తన పేరును గుంటూరు జిల్లా ప్రతినిధుల రిజిస్ట్రర్‌లో లోకేష్ పేరు నమోదు చేసుకున్నారు.

mahanadu.jpg

ఇది కూడా చదవండి: Rajahmundry: నేటి నుంచి టీడీపీ మహానాడు

Updated Date - 2023-05-27T12:51:24+05:30 IST