ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: జగన్ ప్రభుత్వం ఏపీని పాతాళంలోకి నెట్టేసింది

ABN, Publish Date - Dec 21 , 2023 | 09:21 PM

క్రైస్తవులకు ( Christians ) సంబంధించిన చాలా అంశాలు మేనిఫెస్టోలో పెడతానని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) స్పష్టం చేశారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ ( Semi Christmas ) వేడుకలల్లో పాల్గొన్నారు.

అమరావతి: క్రైస్తవులకు ( Christians ) సంబంధించిన చాలా అంశాలు మేనిఫెస్టోలో పెడతానని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) స్పష్టం చేశారు. గురువారం నాడు తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ ( Semi Christmas ) వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేతలు,టీడీపీ క్రిస్టియన్ విభాగ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను, సంస్థలను ఇబ్బంది పెడుతుందని పలువురు మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. మళ్లీ రాష్ట్రానికి మంచి జరిగేలా చంద్రబాబును దేవుడు అనుగ్రహిస్తారని క్రైస్తవ పెద్దలు దీవెనలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...‘‘ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ రోజు గుణదల మేరీ మాత చర్చికి వెళ్లాను. చర్చికు వెళ్లి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మానవ ప్రయత్నానికి...దేవుని అశీస్సులు కావాలి. అప్పుడే సంకల్పం నెరవేరుతుంది. ఈ రాష్ట్రంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మనమీదే దాడి చేసి మళ్లీ మనమీదే కేసులు పెడుతున్నారు. అలాంటి విచిత్రాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. రాష్ట్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నేనే జరిపించాను.. అది నా అదృష్టం. నేను ఈ రోజు బైబిల్ చదివాను. ఈ రోజు నుంచి 100 రోజులు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాత సంవత్సరంలో జరిపోయినవన్ని మర్చిపోవాలి. సంతోషంగా నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.


వైసీపీ నేతలు స్థలాలను కాజేశారు

‘‘బైబిల్లో శత్రువు కూడా ప్రేమించమని చెబుతుంది. ఇప్పుడు మిత్రుడు కూడా శత్రువుగా మారుతున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో మిషనరిలు, స్కూళ్లను ఏర్పాటు చేశాం. మిషనరీలను కూడా కాజేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎంతో మంది దాతలు స్థలాలు ఇస్తే.. మొత్తం కాజేశారు. గుంటూరులో శంకర్ విలాస్ హోటల్ ఉంది. ఒక అన్యాయం జరిగితే శంకర్ విలాస్ హోటల్ యజమాని రంగనాయకమ్మ ట్విట్టర్‌లో తపకు జరిగిన అన్యాయంపై ట్వీట్ పెడితే ఆమెను కూడా అరెస్ట్ చేశారు. కోర్టుకి వెళ్లి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అన్ని మాతాల వాళ్లు గుర్తించాలి. రాజకీయ పార్టీ కార్యాలయపైన దాడులు జరుగుతున్నాయి. టీడీపీ కార్యాలయం పైన దాడులు చేశారు.దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను ఇస్తే మా పైనే కేసులు పెట్టారు. ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాధ్‌రెడ్డికి సిగ్గు ఉందా.. ? అని అడుగుతున్నాను. రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతుంది.. విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పాం. ఇలా చెప్పటం తప్పా.. అని డీజీపీని ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్కరూ బైబుల్ చదవాలి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


నా హయాంలో అన్ని కులాలు బాగుపడ్డాయి

‘‘ప్రతి ఒక్కరూ గమనించి పని చేయాలి. అందరూ గమనించకపోతే.. గుంటూరు శంకర్ విలాస్ హోటల్ యజమాని రంగనాయకమ్మ పరిస్థితి ఏర్పడే ప్రమాదముంది. నేను ఐటీని తీసుకువచ్చాను.. నా హయాంలో అన్ని కులాలు బాగుపడ్డాయి. హైదరాబాద్‌ని నేనే అభివృద్ధి చేశాను. ఒకప్పుడు హైదరాబాద్‌ను డెవలప్ చేసిన అనుభవంతో ఏపీని అభివృద్ధి చేయడం తప్పా. ఏపీలో నేను ఐదేళ్లు అభివృద్ధి చేశాను. ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి చేశారో సీఎం జగన్ చెప్పాలి. నువ్వు విశాఖపట్నం వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. విశాఖపట్నం వెళ్లవద్దని.. కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఇక నువ్వు ఇక్కడే ఉండాలి. ఇలాంటి సమయంలో ఓపిగ్గా ఉండాలి. నేను ప్రారంభించిన ప్రతిది నాశనం చేశారు. తూఫాన్ నియంత్రిచలేము కానీ తీవ్రతను తగ్గించవచ్చు జగన్ ప్రభుత్వానికి సూచనలు చేస్తే పాటించదు.. సరికదా ఏపీని పాతాళంలోకి నెట్టేసింది. గతంలో పది రోజలల్లో హూద్ హుద్ తూఫాన్ నష్టం నివారణ అంచనా వేసి.. నష్టం నివారణ చర్యలు తీసుకున్నాం. ఈ దేశంలో పేదరికం లేని సమాజం చూడాలి’’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.

Updated Date - Dec 21 , 2023 | 09:27 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising