MP Raghurama: రాష్టప్రతి ద్రౌపది ముర్ముకు లేఖ
ABN, First Publish Date - 2023-09-25T18:32:26+05:30
ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతల అభ్యర్ధన మేరకు రాష్టప్రతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)కు ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishna Raju) లేఖ రాశారు.
ఢిల్లీ: ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతల అభ్యర్ధన మేరకు రాష్టప్రతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)కు ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishna Raju) లేఖ రాశారు. రాష్టప్రతి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితులను వివరించేందుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. ఏపీలో శాంతి భద్రతలకు అధికార పార్టీ విఘాతం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్రజాస్వామిక వ్యవహరిస్తోంది. రాష్ర్టంలో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారు. ఏపీలో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, అరెస్టులు, గృహనిర్బందాలు చేస్తున్నారు’’ అని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2023-09-25T18:32:26+05:30 IST