MP Raghurama: చెవిరెడ్డి బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేయలేదా..?
ABN, First Publish Date - 2023-12-04T20:26:14+05:30
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ( Chevireddy Bhaskar Reddy ) ప్రగతి భవన్‌లో కూర్చొని సర్వే చేసి బీఆర్ఎస్ ( BRS ) పార్టీని ఈ ఎన్నికల్లో ఎలా గెలిపించాలనే దానిపై చర్చించలేదా, బీఆర్ఎస్ గెలుపు కోసం ఆయన పని చేయలేదా అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) ప్రశ్నించారు.
ఢిల్లీ: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ( Chevireddy Bhaskar Reddy ) ప్రగతి భవన్‌లో కూర్చొని సర్వే చేసి బీఆర్ఎస్ ( BRS ) పార్టీని ఈ ఎన్నికల్లో ఎలా గెలిపించాలనే దానిపై చర్చించలేదా, బీఆర్ఎస్ గెలుపు కోసం ఆయన పని చేయలేదా అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) ప్రశ్నించారు. సోమవారం నాడు ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ‘‘2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం రాయలసీమ సామాజిక వర్గంతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పని చేయించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మనీ తరలింపునకు జగన్, కేసీఆర్ ఉపయోగించారనేది వాస్తవం కాదా ఇది నిజమో కాదో చెప్పాలి. వైసీపీ నేతలు గుండెల మీద చెయి వేసుకొని చెప్పాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ని గెలిపించడానికి నాగార్జున సాగర్ నీటి యుద్ధాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఇలాంటి తుంటరి యుద్ధానికి ఎండ్ పెట్టాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చారు. ఇన్నాళ్లు లేని నీటి సమస్య తెలంగాణలో పోలింగ్ రోజే గుర్తుకు వచ్చిందా. తెలంగాణ అధికారులు ఎక్కడ కూడా నీటి విషయంపై మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో గెలిస్తే సంబరాలు చేసుకుంటే తప్పెంటి. తెలంగాణలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వెంకట్‌రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు. విజయసాయిరెడ్డి కాంగ్రెస్ గెలుపుపై నీచంగా ట్వీట్ పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ నెగ్గితే సాయిరెడ్డికి ఎందుకు. ఊర్లో పెళ్లికి ఎందుకు సంబరాలని విజయసాయి ట్విట్ చేయడం ఆయన లేఖితనానికి నిదర్శనం’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
బీజేపీ ఓటమికి వైసీపీ కృషి
‘‘తెలంగాణలో బీజేపీ ఓటమికి వైసీపీ కృషి చేసింది. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించడానికి వైసీపీ పనిచేసిందని కేంద్ర పెద్దలకు చెబుతాను. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మంచిగా పని చేశారు. తెలంగాణలో గత కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. మూడు రాష్టాలల్లో బీజేపీ విజయం సాధించింది. తెలంగాణలో కూడా బీజేపీ మంచి పోటీ ఇచ్చింది. వైసీపీకి బీజేపీతో మంచి చెలిమి ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రెండు సార్లు ఎంపీ అయ్యారు.. కేంద్రమంత్రి అయ్యారు. విజయ సాయిరెడ్డి లాగా దొడ్డిదారిలో ఎంపీ కాలేదు. సాయిరెడ్డికి పురందేశ్వరి ఎక్కడ పోటీ చేస్తారో చెప్పడం అనవసరం’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు.
ఏపీ భవిష్యత్తు గురించి చంద్రబాబు మథన
‘‘చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల గురించి ఆలోచించలేదు. ఏపీ భవిష్యత్తు గురించి మథన పడుతున్నారు. భవిష్యత్‌లో ఏపీ రాజకీయాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. ఏపీలో పట్టుమని వైసీపీకి 15 సీట్లు కూడా రాకపోవచ్చు. ఏపీలో మా పార్టీ వాళ్లు దారుణంగా ఓడిపోతారు. రాబోయే మూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఇప్పుడు ఉన్న పాలకులు ఏపీని సర్వనాశనం చేశారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం లా&ఆర్డర్ , అభివృద్ధి బాగానే ఉంది. ఏపీలో గతంలో ఉన్న రోడ్లు కూడా పోయాయి. చెత్తలిక్కర్‌తో మరణాలు పెరిగాయి’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-12-04T20:26:16+05:30 IST