ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Payyavula Keshav: జగన్ .. కిల్ డెవలప్‌మెంట్ పాలసీని అవలంభిస్తున్నారు

ABN, First Publish Date - 2023-09-15T17:19:24+05:30

ఏపీలో జగన్‌రెడ్డి(Jagan Reddy) .. కిల్ డెవలప్‌మెంట్ పాలసీని అవలంభిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్( Payyavula Keshav ) వ్యాఖ్యానించారు.

అమరావతి: ఏపీలో జగన్‌రెడ్డి(Jagan Reddy) .. కిల్ డెవలప్‌మెంట్ పాలసీని అవలంభిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్( Payyavula Keshav ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇమేజ్‌కు మరక అంటించాలనే ప్రయత్నంలో భాగంగానే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఏపీ నుంచి జగన్ సర్కార్ పరిశ్రమలను తరిమేసింది.సిమెన్స్‌, ఒరిజనల్ సిమెన్స్‌కు సంబంధం లేదని వైసీపీ నిరూపించాలి. చంద్రబాబు అరెస్ట్‌తో వేల మంది జీవితాలు తారుమారయ్యాయి.ఏపీ ప్రభుత్వం కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇస్తోందని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీకి‌ డిపాజిట్లు గల్లంతు పయ్యావుల

టీడీపీతో జనసేన(TDP, Jana Sena) కలిస్తే.. నిప్పుకు గాలి తోడు అయినట్లేనని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ..టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తే.. వైసీపీకి డిపాజిట్ రాదని ఆనేతలే ఒప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి‌ డిపాజిట్లు గల్లంతు అవటం ఖాయం. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ అరాచక పాలనను టీడీపీ ఎంపీలు ప్రస్తావిస్తారు. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏపీ సర్కార్ పెట్టే కేసులకు టీడీపీ కార్యకర్తలే భయపడటం లేదు. తన ఓటమిని వైసీపీ నేతలు ఎన్నికలకు ముందే ఒప్పుకుంటున్నారని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-15T17:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising