ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghurama: జగన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రఘురామ.. కారణమేంటంటే..?

ABN, First Publish Date - 2023-09-23T16:05:22+05:30

ఈరోజు (సెప్టెంబర్ 23) వైసీపీ నేతలు(YCP Leaders) సంబరాలు చేసుకునే రోజు... జగన్(Jagan) జైల్ శిక్ష నుంచి పదేళ్లు పూర్తి అయ్యాయని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) ఎద్దేవ చేశారు.

ఢిల్లీ: ఈరోజు (సెప్టెంబర్ 23) వైసీపీ నేతలు(YCP Leaders) సంబరాలు చేసుకునే రోజు... జగన్(Jagan) జైల్ శిక్ష నుంచి పదేళ్లు పూర్తి అయ్యాయని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) ఎద్దేవ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురామ. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. శనివారం నాడు ఆయన ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘43 వేల కోట్ల అవినీతి కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై రావడం నిరంతరం అలాగే కొనసాగేలా చూసుకుంటుండడం చాలా గొప్ప విషయం. సీబీఐ కోర్టుకు కూడా హాజరుకావాల్సిన అవసరం లేదని జగన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇంత ఘనత వహించిన సీఎం జగన్‌కు శుభాకాంక్షలు. వ్యవస్థలను వివస్త్రను చేసి ఆడుకుంటున్న మా నాయకుడు గొప్పవాడు. కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేయడం బాగానే ఉంది. ఆ తర్వాత సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ కూడా వేశారు.

ఇసుక కుంభకోణం డబ్బు అంత లోటస్‌పాండ్‌కు వెళ్తుందని గతంలో ఉండవల్లి చెప్పారు. రాష్ర్టంలో జరుగతున్న మద్యం, ఇసుక, మైనింగ్ అన్నీటిలో జరుగుతున్న అవినీతిపై ఉండవల్లి పిటిషన్ వేయాలి. ఆయనకు కావాల్సిన సమాచారం నేను ఇస్తాను. ఉండవల్లి మాటలు ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవద్దు అందుకే ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఉండవల్లి త్వరగా పిటిషన్ వేస్తారని అనుకుంటున్న. వివేకానందరెడ్డి కేసులో అజయ్ కల్లం వాయిస్ సైతం రికార్డ్ చేశారు. ఇప్పుడు పిటిషన్ వేస్తే సమయం వృథా చేయడం తప్ప ఏమి లేదు. అక్టోబర్ 11వ తేదీన వివేకానందరెడ్డి పిటిషన్ విచారణకు రాబోతుంది. ఎం అవుతుందో చూడాలి’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-23T16:06:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising