ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghurama: బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్

ABN, First Publish Date - 2023-08-07T16:15:22+05:30

బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి( CM Jagan Mohan Reddy) అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(Raghurama Krishnaraju) అన్నారు.

ఢిల్లీ: బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి( CM Jagan Mohan Reddy) అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(Raghurama Krishnaraju) సెటైర్లు వేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఇంటి నుంచి బయటకు రారు.. అలా వస్తే ఎన్నో చెట్లు నరికి వేస్తారు, జనాలకు ఉపాధి పోతుందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli) వదిలి జగన్ పోలవరం(Polavaram)లో ఉన్ననేతలను ఈ రోజు రాత్రి సమయంలో కలుస్తున్నారని ఎద్దేవ చేశారు. మాములుగా జగన్ ఎవరిని కలవరన్నారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు అవుతుందని గ్రహించి ఇప్పుడు కలుస్తున్నారని చెప్పారు. విపత్తు వచ్చినప్పుడు జగన్ వెళ్తే అధికారులకు ఇబ్బంది ఉంటుందని అక్కడకు వెళ్లారని ఎద్దేవ చేశారు.వరదల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరంలో జరిగిన సమావేశంలో జగన్మోహన్‌రెడ్డి అంత స్క్రిప్ట్ చదివారని దెప్పిపొడిశారు...అసలైన వరద బాధితులను వైసీపీ నేతలు మాట్లాడనివ్వలేదని మండిపడ్డారు. తర్వాత పోలవరం మీటింగ్‌కి జగన్ సీఎం హోదాలో రాలేరని జోస్యం చెప్పారు.


తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో పని ఎక్కడికి వరకు జరిగింది, ఇప్పుడు ఎక్కడి వరకు జరిగిందో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పుంగనూరులో టీడీపీ కావాలని గొడవ చేసిందని సాక్షిలో రాసుకున్నారని దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కూడా ఈ అల్లర్లలో ఉందని ఆ పేపరులో రాశారన్నారు.మంత్రులు చంద్రబాబును బాధ్యుడిని చేయాలని, ఆయనపై కేసు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు.యాత్రలో జనాలను చూస్తే వైసీపీ వాళ్లకు కోపం వస్తుందన్నారు. ఢిల్లీ ఆర్డినెన్సు తర్వాత వైసీపీని పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు...మంత్రి అంబటి రాంబాబు బ్రో సినిమా వదిలేసి ముందు పోలవరం అంశాన్ని చూడాలని హితవు పలికారు. పదివేల కోట్లతో పోలవరం బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-07T16:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising