Sajjala Ramakrishna Reddy: మోదీతో చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం జగన్‌కు లేదు
ABN, First Publish Date - 2023-10-05T17:16:13+05:30
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కేసుల గురించి సీఎం జగన్.. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు.
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కేసుల గురించి సీఎం జగన్.. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘టీడీపీ బలహీన పడిందని పవన్ చేసిన కామెంట్లను టీడీపీ నేతలు ఒప్పుకున్నారా? టీడీపీ పార్టీ బలహీన పడిందని పవన్ అన్నారు. టీడీపీని పవన్ టెకోవర్ చేస్తున్నారా చెప్పాలి. టీడీపీకి పవన్ ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలి. కోర్టు ఆదేశాలతో చంద్రబాబు జైల్లో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి జగన్ కేంద్రంతో మాట్లాడతారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ త్వరగా తిరిగి వస్తే కేసు తేలుతుంది. చంద్రబాబు శ్రీనివాస్‌ని తిరిగి రమ్మని చెప్పాలి. చంద్రబాబు కేసులో టెక్నీకల్ అంశాలపైనే మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలతో సీఎం జగన్మోహన్‌రెడ్డిని, వైఎస్సార్‌ను తిట్టిస్తున్నారు. క్రిష్ణ ట్రీబ్యునల్ సమీక్ష అంశం వచిందే నిన్న. టీడీపీ నేతలు దీనిపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కృష్ణా జలాల అంశాన్ని తిరగతొడటం సరికాదు. కేంద్ర నిర్ణయంపై టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్, అధికారులు సమీక్ష చేస్తారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-10-05T17:16:13+05:30 IST