Kishan Reddy: టూరిజం ప్రగతికి ప్రధాని మోదీ బ్రాండ్ అంబాసిడర్..
ABN , First Publish Date - 2023-02-14T14:50:44+05:30 IST
పల్నాడు జిల్లా: రూ. 7వేల కోట్లతో స్వదేశీ దర్శన్ కింద పనులు చేపడుతున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు.
పల్నాడు జిల్లా: రూ. 7వేల కోట్లతో స్వదేశీ దర్శన్ కింద పనులు చేపడుతున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా (Palnadu Dist.) పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 50 పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. గండికోట ఫోర్ట్ (Gandikota Fort), లంబసింగి (Lambasinghi)లో మ్యూజియం (Museum) ఏర్పాటు.. రాష్ట్రానికి పర్యాటక అభివృద్ధి కింద రూ. 120 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.27.07 కోట్లతో అమరావతి (Amaravathi) అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. టూరిజం ప్రగతికి ప్రధాని మోదీ (PM Modi) బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador)గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. విద్యాసంస్థల్లో యువ టూరిజం క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
దేవాలయాల్లో విద్యుత్ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నామని, కొన్ని దేవాలయలు కమర్షియల్‌గా మారాయని కిషన్ రెడ్డి విమర్శించారు. అది మంచి సంస్కృతి కాదని... కాశీ లాంటి ప్రాంతాలకు ప్రతి ఒక్కరు వెళ్లాలని కోరుకుంటారన్నారు. అందుకే పేదలు కాశీ వెళ్లడానికి కొన్ని రాయితీలు ఏర్పాటు చేస్తున్నామని కిషర్ రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి..
కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అమరావతి రాజధాని రైతులు కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాజధాని రిటర్న్ బుల్ ప్లాట్‌లను బ్యాంకులలో పెట్టుకోవడం లేదని.. దీంతో తమ పిల్లల చదువులు, శుభకార్యాలకు ఇబ్బందులు పడుతున్నామని, కేంద్ర ప్రభుత్వ సంస్థలను త్వరగా నిర్మాణం చేపట్టాలని కోరామన్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం చేయాలని కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తిపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చినట్లే కేంద్ర సంస్థల నిర్మాణలు చేపడతామని కిషన్ రెడ్డి చెప్పారని రాజధాని రైతులు పేర్కొన్నారు.