ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: విజయసాయి చరిత్ర అంతా అవినీతిమయం

ABN, First Publish Date - 2023-11-18T21:06:31+05:30

ఏ2 విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) గురివింద గింజ లాంటివాడని.. ఆయన చరిత్ర అంతా అవినీతిమయం అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ( Varla Ramaiah ) అన్నారు.

అమరావతి: ఏ2 విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) గురివింద గింజ లాంటివాడని.. ఆయన చరిత్ర అంతా అవినీతిమయం అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ( Varla Ramaiah ) అన్నారు. శనివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై అవకాకులు చవాకులు పేల్చడం కరెక్టు కాదు. విజయసాయికి అదృష్టం కలిసి రావడంతో ఎంపీ అయినంత మాత్రాన ఇలాంటి వ్యవహారశైలి ఉండకూడదు. కోట్లకు పడగలెత్తి ఎలా సంపాదించావో బయటకు తీస్తాం. ఏ తప్పు చేయని, ఏ చిన్న అవినీతికి పాల్పడని చంద్రబాబు గురించి మాట్లాడటం సరికాదు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ మధ్యలో చంద్రబాబును తీసుకురావడమేంటి? ఢిల్లీలో కేంద్ర బీజేపీ పెద్దల వద్ద పిల్లిలా వ్యవహరించి, రాష్ట్రానికొచ్చి ఇక్కడ బీజేపీ నేతల పట్ల పులిలా మాట్లాడుతావు. విజయసాయిరెడ్డి పెద్ద మ్యానిపులేటెర్’’ అని వర్ల రామయ్య మండిపడ్డారు.

ఆ విషయంలో విజయసాయి హస్తం ఉంది

‘‘అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి బెయిల్ రావడానికి, అతను అప్రూవర్‌గా మారడంలో విజయసాయి హస్తం ఉంది.. కాకపోతే అతన్ని అప్రూవర్ గా అంగీకరించారు. పదే పదే ఢిల్లీ లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి తరపున మాట్లాడితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ మీకు వార్నింగ్ ఇవ్వడం నిజంకాదా? నీవు అవినీతిపరుడు కాకపోతే శరత్ చంద్రారెడ్డి అరెస్టు వెంటనే మీ సెల్ ఫోన్ ఎలా పోతుంది? ఎందుకు హడావిడిగా ఫోన్ పోయిందని పోలీసులతో కేసు రిజిష్ట్రర్ చేయించావు? లిక్కర్ స్కామ్‌కి విజయసాయికి సంబంధం బహిర్గతమవుతుందనే ఫోన్ పోయిందని నాటకమాడారు. ఇటీవల మీ ఆస్తుల పెంపుదలపై జగన్ వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? విజయసాయి అవినీతిపరుడు కాకపోతే రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్‌గా పేరు ఎందుకు తొలగించారు’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Updated Date - 2023-11-18T21:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising