Chandrababu : నేడు చంద్రబాబు కేసుల్లో కీలక విచారణ
ABN , First Publish Date - 2023-10-17T07:41:23+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం టెన్షన్ నెలకొంది. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసుల్లో కీలక విచారణ జరగనుంది. ఏపీ హైకోర్ట్ లో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై కీలక వాదనలు జరగనున్నాయి.

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం టెన్షన్ నెలకొంది. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసుల్లో కీలక విచారణ జరగనుంది. ఏపీ హైకోర్ట్ లో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై కీలక వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో బాబు తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు వైద్య నివేదికపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తుది విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులోనే చంద్రబాబుకు ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ అలాగే రేపు ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ అలైన్‌మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.