Cyclone Michaung: భారీ ఈదురుగాలులకు కుప్పకూలిన ఐరన్ రాడ్స్.. తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2023-12-05T12:45:21+05:30 IST
Andhrapradesh: మిచౌంగ్ తుఫాన్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. బీఆర్‌టీఎస్ రోడ్డు భానునగర్ వద్ద తుఫాన్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఈదురుగాలులతో ఐరన్ రాడ్స్ కుప్పకూలాయి. తీవ్రమైన గాలికి బిల్డింగ్ ప్లాస్టింగ్ సపోర్టింగ్ కోసమా కట్టిన పరంజ కూలిపోయింది.
విజయవాడ: మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. బీఆర్‌టీఎస్ రోడ్డు భానునగర్ వద్ద తుఫాన్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఈదురుగాలులతో ఐరన్ రాడ్స్ కుప్పకూలాయి. తీవ్రమైన గాలికి బిల్డింగ్ ప్లాస్టింగ్ సపోర్టింగ్ కోసమా కట్టిన పరంజ కూలిపోయింది. సుమారుగా ఐదంతస్తులపై నుంచి పరంజ జారి పడిపోయింది. ఐరన్ రాడ్లు ఒక్కసారిగా ఐదు అంతస్తులపై నుంచి పడిపోవడంతో సుమారుగా ఐదు ఇల్లులు ధ్వంసమయ్యాయి. ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఐరన్ రాడ్లు పడిన సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. భారీ నష్టం వాటిల్లడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.