చంద్రబాబుతోనే రాషా్ట్రనికి ఉజ్వల భవిష్యత్తు
ABN , First Publish Date - 2023-06-07T22:53:59+05:30 IST
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గ్యారెంటీ అని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశకుమార్‌రెడ్డి అన్నారు.

ఫమాజీ ఎమ్మెల్యే రమేశకుమార్‌రెడ్డి
రాయచోటిటౌన, జూన7: రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గ్యారెంటీ అని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశకుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువత, వెనుకబడిన తరగతుల బలోపేతంతో పాటు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పేదలను ధనికులుగా తీర్చిదిద్దడానికి చంద్రబాబునాయుడు తొలి మేనిఫెస్టో ప్రకటించారన్నారు. దీనిపై ఈ నెల 9న శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు రాయచోటి పట్టణంలోని బోస్‌నగర్, పోస్టాఫీస్ సమీపంలో ఉన్న నూతన తెలుగుదేశం పార్టీ భవనలో నియోజకవర్గ స్థాయి చర్చా వేదిక ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మాజీ సభ్యులు, మండల టీడీపీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, క్లస్టర్ ఇనచార్జిలు, యూనిట్ ఇనచార్జిలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరుకావాలన్నారు. ఈ కార్య క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, క్లస్టర్ ఇనచార్జి సత్యారెడ్డి, పెమ్మాడపల్లె సర్పంచ పల్లపు వాసు తదితరులు పాల్గొన్నారు.