టీడీపీకి పేరు రాకూడదనే హజ్‌ హౌస్‌ నిరుపయోగం

ABN , First Publish Date - 2023-04-12T23:13:13+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మైనార్టీల్లో మంచి పేరు రాకూడదనే వైసీపీ ప్రభత్వం హ జ్‌ హౌస్‌ను ప్రారంభించలేదని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీకి పేరు రాకూడదనే హజ్‌ హౌస్‌ నిరుపయోగం
హజ్‌హౌస్‌ ఎదుట సెల్ఫీ తీసుకుంటున్న అమీర్‌బాబు

టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు

కడప (ఎర్రముక్కపల్లె), ఏప్రిల్‌ 12: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మైనార్టీల్లో మంచి పేరు రాకూడదనే వైసీపీ ప్రభత్వం హ జ్‌ హౌస్‌ను ప్రారంభించలేదని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హజ్‌హౌస్‌ వద్ద సెల్ఫీ తీసుకున్న ఆయన ప్రభుత్వానికి సవాల్‌ విసురుతూ టీడీపీ హయాంలో చంద్రబాబు మైనార్టీలకు పెద్దపీట వేస్తూ జిల్లాలో రూ.28 కోట్లతో రాష్ట్ర మైనార్టీల కోసం హజ్‌ హౌస్‌ ఏర్పాటు చేశారన్నారు.

అయితే ఇప్పుడు అది నిరుపయోగంగా మారిందన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లా, మైనార్టీశాఖ మం త్రి, డిప్యూటీ సీఎం జిల్లాలో ఉన్నా హజ్‌ హౌస్‌ నిర్వీర్యం చేశారన్నారు. వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా హజ్‌హౌస్‌ ప్రారంభోత్సవానికి నోచుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ఇక్క డి నుంచే మైనార్టీలు హజ్‌కు వెళ్లేలా చర్యలు చేపడతామని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి అనే విధంగా పరిపాలన ఉంటుందన్నారు.

Updated Date - 2023-04-12T23:13:13+05:30 IST