అనధికార నిర్మాణాలు, లేఅవుట్లను నివారించాలి
ABN , First Publish Date - 2023-10-05T22:52:27+05:30 IST
కడప అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (హుడా) పరిధిలో అనధికారిక నిర్మాణాలను, లేఅవుట్లను నివారించేలా ఎల్‌టీపీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కో-ఆర్డినేషన్‌తో పనిచేయాలని హుడా చైర్మన్ వై.ఓ.నందన్ తెలిపా రు.

కడప(రూరల్) అక్టోబరు 5: కడప అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (హుడా) పరిధిలో అనధికారిక నిర్మాణాలను, లేఅవుట్లను నివారించేలా ఎల్‌టీపీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కో-ఆర్డినేషన్‌తో పనిచేయాలని హుడా చైర్మన్ వై.ఓ.నందన్ తెలిపా రు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ హాలులో ఎల్‌టీపీలు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుడా పరిధిలో అనధికారిక నిర్మాణాలు, లేఅవుట్లను నివారించేందుకు ఎల్‌టీపీలు కీలకపాత్ర పోషించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో 300 చదపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన భవన నిర్మాణాలన్నీ కూడా అనుమతులు తీసుకునేలా చూడాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లో కమర్షియల్ కట్టడాలు తప్పనిసరిగా అనుమతులు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొనడం వలన జరిగే నష్టంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ లేవుట్లలో తక్కువ ధరలో అన్ని వసతులతో కూడిన ప్లాట్లు అందుబాటులోకి వస్తున్నాయని ప్రజలు ఈ అవకావాన్ని ఉపయోగించుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో హుడా ప్లానింగ్ ఆఫీసర్ శైలజ, ఏపీవో సీటీ క్రిష్ణసింగ్, డబ్లుపీఆర్‌ఎ్‌సలు పాల్గొన్నారు.