Kotam Reddy : కేసులు పెట్టి జైళ్లలో వేస్తారా? ఎన్నైనా పెట్టుకోండి.. భయపడేదే లే..
ABN, First Publish Date - 2023-02-25T11:03:03+05:30
‘ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెన్ను తిప్పను మడిమ తిప్పను, భయపడను. ఎంతటి వారినైనా ఎదుర్కొంటాను’ అని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
నెల్లూరు : ‘ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెన్ను తిప్పను మడిమ తిప్పను, భయపడను. ఎంతటి వారినైనా ఎదుర్కొంటాను’ అని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) పేర్కొన్నారు. నేడు ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. తనపై కేసులు పెట్టి జైళ్లలో వేస్తారా? ఎన్నైనా పెట్టుకోండి. భయపడేదే లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడబోనన్నారు. నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వాన్నంగా ఉన్నాయన్నారు. డ్రైన్‌లు లేవని.. విద్యుత్ సరిగా లేదన్నారు.
పొట్టెపాళెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని ఒకటిన్నర సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తున్నానని కోటంరెడ్డి పేర్కొన్నారు. ములుమూడి వంతెన, రోడ్లకి రూ.28కోట్లు ఇస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు. కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అడిగానన్నారు. కాంట్రాక్టర్ రెండు కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఇంత వరకూ బిల్లులు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం తన పరిస్థితి అరణ్య రోదనగా మారిందని కోటంరెడ్డి పేర్కొన్నారు. కొమ్మరపూడి రైతులకి పరిహారం ఇవ్వాలని 50 సార్లు అడిగినా ఫలితం లేదన్నారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయాలని, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరానన్నారు. ప్రశ్నిసై ఫోన్ ట్యాప్ చేశారని. నమ్మకం లేని చోట అనుమానించిన చోట ఉండకూడదని అనుకున్నానని కోటంరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
Updated Date - 2023-02-25T11:03:56+05:30 IST