అభివృద్ధి పనులు వేగవంతం
ABN , First Publish Date - 2023-05-19T01:10:06+05:30 IST
జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేస్తున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎ్‌స.జవహర్ రెడ్డికి వివరించారు. గురువారం సీఎస్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రీ సర్వే, జాతీయ రహదారుల విస్తరణ, గృహ నిర్మాణాలు, జగనన్న పాల వెల్లువ, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కలెక్టర్‌ట్, మే 18 : జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేస్తున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎ్‌స.జవహర్ రెడ్డికి వివరించారు. గురువారం సీఎస్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రీ సర్వే, జాతీయ రహదారుల విస్తరణ, గృహ నిర్మాణాలు, జగనన్న పాల వెల్లువ, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ దిల్లీరావు మాట్లాడుతూ, రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వేరాళ్లు నాటే ప్రక్రియ తుదిదశకు చేరుకుందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అర్జీలను నాణ్యతతో అర్జీదారుల సంతృప్తి మేరకు పరిష్కరిస్తున్నామన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించి నిర్ధేశించిన లక్ష్యాల మేరకు వివిధ దశలలో ఉన్న నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామన్నారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 3,345 గ్రామాలలోని 22,884 మంది పాడిరైతులను నమోదు చేశామన్నారు. వీరికి వైఎస్సార్ చేయూత, స్ర్తీ నిధి, ఉన్నతి, బ్యాంక్ లింకేజ్ ద్వారా 2,041 పశువులను అందించామన్నారు. వివిధ దశల్లో చేపడుతున్న మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ పి.సంపత్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివా్‌సరావు, హౌసింగ్ ఎం.రజినీ కుమారి, వ్యవసాయ శాఖ అధికారి ఎస్.నాగమణమ్మ, జిల్లా సర్వే అధికారి కె.సూర్యారావు, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి సీహెచ్. శైలజ, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎ.నాగరాజు, పశుసంవర్ధక శాఖ జేడీ కె.విద్యాసాగర్, ఉద్యానశాఖ అధికారి పి.బాలాజీకుమార్ పాల్గొన్నారు.