Share News

Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ABN , Publish Date - Mar 01 , 2025 | 09:21 AM

Inter Exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఈరోజు (శనివారం) ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదనే నిబంధనను తీసుకొచ్చారు అధికారులు.

Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
AP Inter Exams

అమరావతి, మార్చి 1: ఏపీలో (Andhrapradesh) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (Inter Exams) ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల పరీక్షలు జరుగనున్నాయి. తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు (Students) ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 1500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌‌లో ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాలకు నో మొబైల్ జోన్‌గా ప్రకటించారు.


అయితే అధికారిక సమాచారం కోసం చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రమే ఇంటర్‌ బోర్డు ఒక కీపాడ్ ఫోన్ సమకూర్చింది. ఈ పరీక్షలకు నిమిషం నింబంధనను అమలు చేస్తున్నారు. పరీక్షలు హాజరయ్యే వారు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని అధికారులు తెలిపారు. విద్యార్థులందరూ నింబంధనలను తప్పకుండా పాటించాలని చెప్పారు.


బెస్ట్ ఇవ్వాలన్న సీఎం..

chandrababu.jpg

ఇంటర్ పరీక్షలు ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ఇవాళ పరీక్షలకు హాజరువుతున్న స్టూడెంట్స్‌లో ధైర్యం నింపారు. విద్యార్థులు తమ బెస్ట్ ఇవ్వాలన్నారు. ఫోకస్ చెదరకుండా చూసుకోవాలన్నారు. తమ ప్రతిభ మీద తాము నమ్మకం ఉంచాలని సీఎం సూచించారు. మంత్రి నారా లోకేష్ కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.


అనవసర ఒత్తడి వద్దు: లోకేష్

lokesh.jpg

విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాయాలన్నారు మంత్రి లోకేష్. అలాగని అనవసర ఒత్తిడి పడొద్దని సూచించారు. ఇన్నాళ్లుగా చేసిన ప్రిపరేషన్, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గెలుపు దిశగా నడిపిస్తాయని చెప్పుకొచ్చారు. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో స్టూడెంట్స్ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలన్నారు లోకేష్. పరీక్షల్లో అదరగొట్టాలన్నారు. బెస్ట్ ఇవ్వాలని.. తప్పక విజయం దక్కుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu Naidu: నెలాఖరులోగా పదవుల భర్తీ

Vision 2047: పండంటి ప్రగతికి 10 సూత్రాలు!’

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 01 , 2025 | 10:03 AM