Devineni Uma: అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కొడాలి నానికి పడుతుంది
ABN, First Publish Date - 2023-09-27T22:26:27+05:30
అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కొడాలి నాని(Kodali Nani)కి పడుతుందని... ఎగిరెగిరి, మిడిసి మిడిసి పడమాకండి ఆరు నెలల్లో ఊడిపోయే పదువులు మీవి. అన్ని లెక్కలు తెలుస్తామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా(మైలవరం): అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కొడాలి నాని(Kodali Nani)కి పడుతుందని... ఎగిరెగిరి, మిడిసి మిడిసి పడమాకండి ఆరు నెలల్లో ఊడిపోయే పదువులు మీవి. అన్ని లెక్కలు తెలుస్తామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంతను దేవినేని ఉమా వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే వసంత అసెంబ్లీలో నారా లోకేష్‌పై ఆరోపణలు చేసినందుకు గానూ దేవినేని కౌంటర్ ఇచ్చారు. మైలవరంలో టీడీపీ నాయకుల రిలే నిరాహార దీక్షలను బుధవారం నాడు సందర్శించారు. నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు. ఈసందర్భంగా దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ....‘‘మంత్రి రోజా చాలా బాధ్యతరహిత్యంగా మాట్లాడుతోంది.
నారా భువనేశ్వరి, బ్రాహ్మణిల గురించి మాట్లాడే నైతిక అర్హత రోజాకు లేదు. జగన్ ఎమ్మెల్యే వసంతను కొడతాను అంటేనే నారా లోకేష్ గురించి మాట్లాడుతున్నాడు. మొన్నటి దాకా ముసుకు కూర్చున్నావు. నేను తిరగను, నాకు వంద కోట్లు నష్టం వచ్చిందని, వేయి కోట్లు పోయాయాని ప్రచారం చేసుకున్నావు, నువ్వు వ్యాపారం చేయడానికి వచ్చావా? మట్టి, ఇసుక, కొండపల్లి గ్రావెల్ అమ్ముకొని వందల కోట్లు దోచుకున్నావు. జగన్‌రెడ్డి అవినీతి లెక్క 3.58 వేల కోట్లకు తెలింది. జగన్ అవినీతి గురించి ఎమ్మెల్యే వసంత మాట్లాడడు.. ఎందుకంటే ఆయనే ఓ పెద్ద దొంగ. ఈడీ, సీబీఐ కేసుల్లో ముద్దాయివి నువ్వు.. నారా లోకేష్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. రాజధాని పోతే రాజీనామా చేస్తానన్నావు ఇప్పుడు జగన్‌రెడ్డి విశాఖపట్నానికి రాజధానిని తీసుకుపోతానంటున్నాడు. దమ్ముంటే అమరావతి రాజధాని కోసం ఎమ్మెల్యే వసంత నువ్వు ఏం చేస్తావో చెప్పు. అమెరికా వెళ్లి టీడీపీ అంటావు, ఏపీకు రాగానే జగన్ మెప్పు కోసం చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడతావు మీ బతుకులు ఏంటో అందరికీ తెలుసు. సైకో కళ్లల్లో పైశాచిక ఆనందం కోసం కొడాలి నాని, రోజా హద్దు మీరి మాట్లాడుతున్నారు. , మీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయం’’ అని దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-27T22:26:27+05:30 IST