నాడు-నేడు పనులపై ఎంఈవో అసంతృప్తి

ABN , First Publish Date - 2023-06-25T00:47:15+05:30 IST

మండలంలో గుండెబోయినపాలెం, పోచంపల్లి గ్రామాల్లో నాడు-నేడు కింద పాఠశాలలో పనులు పూర్తి కాక పోవటంపై జగ్గయ్యపేట ఎంఈవో చిట్టిబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

నాడు-నేడు పనులపై ఎంఈవో అసంతృప్తి
గుండెబోయినపాలెంలో తరగతి గదిలో సిమెంట్‌ బస్తాలపై అసహనం

జగ్గయ్యపేట, జూన్‌ 24: మండలంలో గుండెబోయినపాలెం, పోచంపల్లి గ్రామాల్లో నాడు-నేడు కింద పాఠశాలలో పనులు పూర్తి కాక పోవటంపై జగ్గయ్యపేట ఎంఈవో చిట్టిబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూళ్ల పునఃప్రారంభం నాటికే పూర్తి చేయాల్సి ఉండగా ఎక్కడ పనులు అక్కడే ఉండటంపై అసహనం వ్యక్తంచేశారు. తరగతి గదుల్లో భవన నిర్మాణ సామగ్రి ఉంచటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను అదే గదిలో కింద కూర్చొపెట్టి పాఠాలు ఏలా చెబుతారని ప్రశ్నించారు. హెచ్‌ఎంలు ప్రత్యేకశ్రద్ధ పెట్టి పనులు పూర్తి చేయాలని, పనుల పర్యవేక్షణ ఏఈతో మాట్లాడారు. అనంతరం వేదాద్రిలో పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-25T00:47:15+05:30 IST