Perni Nani : చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికే పదవులు కట్టబెట్టారు
ABN, First Publish Date - 2023-11-14T18:03:22+05:30
టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కమ్మ సామాజిక వర్గానికే ఎక్కువగా పదవులు కట్టబెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani ) అన్నారు.
కృష్ణాజిల్లా (మచిలీపట్నం) : టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కమ్మ సామాజిక వర్గానికే ఎక్కువగా పదవులు కట్టబెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani ) అన్నారు. మంగళవారం నాడు జెడ్పీ సర్వసభ్య సమావేశం అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘‘జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా విజయవాడ మేయర్, జడ్పీ చైర్మన్, గుంటూరు మేయర్ బీసీ, ఎస్సీలకు ఎప్పుడైనా పదవి కట్టబెట్టడా..? రాజ్యసభకు ఎప్పుడైనా తన సొంత సామాజిక వర్గానికి కాకుండా ఇతర కులాలకు చెందిన వారిని నియమించారా...? జగన్మోహన్‌రెడ్డి ముఖ్యంత్రి అయిన తర్వాత ఎన్నడూ ఊహించని కులాలను రాజ్యసభకు పంపారు. జెడ్పీ చైర్మన్‌గా మా బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళను చైర్మన్‌గా చేశారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.
Updated Date - 2023-11-14T18:03:23+05:30 IST