ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-07-01T07:43:24+05:30 IST
ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి మూల విరాట్‌ను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అర్చక స్వాములు అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి మూల విరాట్‌ను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అర్చక స్వాములు అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు అందించనున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో శాకాంబరి దేవి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నారు.