TDP Chief: తారకరత్న ఆరోగ్యస్థితిపై చంద్రబాబు ఆరా

ABN , First Publish Date - 2023-01-27T14:59:32+05:30 IST

టీడీపీ నేత లోకేష్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన సినీ నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

TDP Chief: తారకరత్న ఆరోగ్యస్థితిపై చంద్రబాబు ఆరా

అమరావతి: టీడీపీ నేత లోకేష్ పాదయాత్ర (TDP Leader Lokesh Yuvagalam Padayatra)లో తీవ్ర అస్వస్థతకు గురైన సినీ నటుడు తారకరత్న (Actor Tarakaratna) ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu)ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తారకరత్నకు వైద్యం అందిస్తున్న కుప్పం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రి వద్ద ఉన్న బాలకృష్ణతో పాటు, పార్టీ నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడారు.

కాగా.. లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థన నిర్వహించగా తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేష్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు తరలిరావడంతో వారి తాకిడికి తట్టుకోలేక తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ను కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే తారకరత్న గుండెపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనకు యాంజియోగ్రామ్ చేశారు. ప్రస్తుతం తారకరత్నకు ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

Updated Date - 2023-01-27T15:00:24+05:30 IST