Venigandla Ramu: చంద్రబాబు జైల్లో ఉంచాలని సర్కార్ అడ్డదారులు తొక్కుతోంది
ABN , First Publish Date - 2023-09-14T11:32:35+05:30 IST
గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో చంద్రబాబు సంఘీబావ రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి.
కృష్ణా జిల్లా: గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము (TDP Leader Venigandla Ramu) ఆధ్వర్యంలో చంద్రబాబు (Chandrababu Arrest) సంఘీబావ రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. నందివాడ మండల టీడీపీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. నల్ల కండువాలు కప్పి రెండో రోజు శిబిరాన్ని వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబును జైల్లోనే ఉంచాలనే రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఏమి లేని కేసులో మహనీయుడుపై, ప్రభుత్వ చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉందని.. న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజమైన ధైర్యవంతుడిగా చంద్రబాబు నిలిచారరి... తన నిజాయితీని నిరూపించుకుంటారని అన్నారు. న్యాయ వ్యవస్థ వాస్తవాలను గుర్తించాలన్నారు. తామంతా చంద్రబాబు వెంట ఉంటామనే సందేశాన్ని తెలుగు ప్రజలు బలంగా వినిపించారన్నారు. చంద్రబాబు ధైర్యం తమలో స్ఫూర్తిని నింపుతుందని వెనిగండ్ల రాము పేర్కొన్నారు.