వైసీపీ పతనం తథ్యం
ABN , First Publish Date - 2023-06-09T00:32:36+05:30 IST
టీడీపీ మేనిఫెస్టోతో సీఎం జగన్ వెన్ను లో వణుకు పుట్టిందని, వైసీపీ ప్రభుత్వ పతనం తథ్యమని మంత్రాల యం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు.

10 నుంచి ‘ప్రజల భవిష్యత్తు గ్యారెంటీ’
150 రోజులు ఇంటింటి పర్యటన
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి
మంత్రాలయం, జూన్ 8: టీడీపీ మేనిఫెస్టోతో సీఎం జగన్ వెన్ను లో వణుకు పుట్టిందని, వైసీపీ ప్రభుత్వ పతనం తథ్యమని మంత్రాల యం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు. గురువారం స్థానిక పంకజ్ అతిథి గృహంలో టీడీపీ మండల అధ్యక్షుడు పన్నగ వెంకటేశ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌కు నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంద న్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ నెల 10 నుంచి ‘ప్రజల భవిష్యత్తు గ్యారెంటి’ కార్యక్ర మంలో భాగంగా 150 రోజులు నిరంతరంగా గ్రామాలను సందర్శించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించే ప్రణాళిక సిద్ధం చేశామ న్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమా నులు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, చంద్రబాబు ప్రకటించిన ‘మన భవిష్యత్తు గ్యారెంటీ’ పథకాలను వివరిం చేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడమే తప్ప.. అభివృద్ధి శూన్యమన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు పూజారి వ్యాసరాజాచార్, బూదూ రు మల్లికార్జున రెడ్డి, అశోక్ రెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు అమర్నాథ్‌రెడ్డి, విజయరామిరెడ్డి, ఎంపీటీసీ నక్కి వెంకటేశ్, తిక్కస్వామి గౌడు, మాజీ ఎంపీటీసీ బెస్త ఈరన్న, నరసింహులు, పైబావి నరిసిరెడ్డి, బూదూరు నాయకులు మల్లికార్జున రాముడు పాల్గొన్నారు.