Ambati Rambabu: నువ్వు ఒక చెప్పు చూపిస్తే.. మేము నాలుగు చూపిస్తాం.. పవన్‌పై అంబటి ఫైర్
ABN , First Publish Date - 2023-06-16T13:50:00+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు హిరోగా మంచి ఇమేజ్ ఉందన్నారు. సినిమాల్లో హీరోగా ఉండి రాజకీయాల్లో హీరో అవుతారని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.
రాజమండ్రి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) విమర్శలు చేస్తున్నారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు హిరోగా మంచి ఇమేజ్ ఉందన్నారు. సినిమాల్లో హీరోగా ఉండి రాజకీయాల్లో హీరో అవుతారని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. హీరోగా ఉండి రాజకీయాల్లో కామెడీ నటుడు అవుతారని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ యెద్దేవా చేశారు. వైసీపీని ప్రశ్నించటానికి మాత్రమే పుట్టిన పార్టీ జనసేన అని అన్నారు. పవన్ కళ్యాణ్ ధ్యేయం ముఖ్యమంత్రి కావటమా? లేక.. అసెంబ్లీలోకి అడుగుపెట్టడమా ? అని ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేస్తారా అనేది పవన్ కళ్యాణ్ స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.
స్థిరత్వం లేని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారన్నారు. పవన్‌ను చంద్రబాబు నడుపుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో హీరోను కాను అని చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నారని.. పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపిస్తే తాము నాలుగు చెప్పులు చూపిస్తామని హెచ్చరించారు. బీజేప, టీడీపీ, జనసేనలు పొత్తుతో పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ప్రవాహాన్ని నియంత్రించే కట్ట గైడ్ బండ్ కుంగిందని.. గైడ్ బండ్ కుంగిన విషయాన్ని దాయాల్సిన అవసరం లేదన్నారు. సాంకేతిక కారణాలపై అధ్యాయనం చేస్తున్నామన్నారు. 41.15 కాంటూరు లెవెల్‌కు భూమి సేకరణ, పునరావాసం కల్పిస్తామన్నారు. రెండో దశలో 45.72 కాంటూరు లెవల్ పూర్తి చేస్తామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.