ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Somireddy: కేసు మీద కేసు పెట్టాలా.. చంద్రబాబును జైల్లో పెట్టాలనేదే జగన్‌రెడ్డి లక్ష్యం

ABN, First Publish Date - 2023-11-23T17:19:59+05:30

కేసు మీద కేసు పెట్టాలా.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) ను జైల్లో పెట్టాలనేదే జగన్‌రెడ్డి ( Jagan Reddy ) లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) ఎద్దేవ చేశారు.

నెల్లూరు: కేసు మీద కేసు పెట్టాలా.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) ను జైల్లో పెట్టాలనేదే జగన్‌రెడ్డి ( Jagan Reddy ) లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) ఎద్దేవ చేశారు. గురువారం నాడు తోటపల్లి గూడూరు మండలం కోడూరు వెంకన్న పాలెంలో ‘‘బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ’’ , ఇంటింటా ప్రచారం కార్యక్రమాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇవ్వడం ఫైబర్ నెట్ కేవలం 145 రూపాయలకు ఇవ్వడం ఆయన చేసిన ఘోరమైన తప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తలలను తాకట్టుపెట్టి అప్పు తెచ్చే పరిస్థితికి ఈ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వచ్చాడు. అలాగే మా రాష్ట్ర ప్రజలు ఇన్నేళ్లు తాగుతారని తాకట్టు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు వచ్చింది. ఎందుకు సమీక్ష చేయరు. వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఎందుకు ప్రజల మధ్యకు వెళ్లరు’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2023-11-23T17:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising