ఘనంగా లోకేష్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2023-01-24T00:19:30+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముఖ్య నేతలతో పాటు టీడీపీ శ్రేణులు పలు ప్రాంతాల్లో కేక్‌ కటింగ్‌లు చేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. టీడీపీ శాసనసభా పక్ష విప్‌, కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి కొండపిలో జరిగిన లోకేష్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు.

ఘనంగా లోకేష్‌ జన్మదిన వేడుకలు
లోకేష్‌ జన్మదిన సందర్భంగా కొండపిలో స్వామికి కేక్‌ తినిపిస్తున్న నాయకులు

ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు

ఒంగోలు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముఖ్య నేతలతో పాటు టీడీపీ శ్రేణులు పలు ప్రాంతాల్లో కేక్‌ కటింగ్‌లు చేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. టీడీపీ శాసనసభా పక్ష విప్‌, కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి కొండపిలో జరిగిన లోకేష్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొర్రెపాటి రామయ్య ఇతర నేతలు పాల్గొన్నారు. త్రిపురాంతకంలో వైపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జీ గుడూరి ఎరిక్షన్‌బాబు కేక్‌ కట్‌ చేయడంతోపాటు పార్టీశ్రేణులతో కలిసి త్రిపురసుందరీదేవి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. త్వరలో జరగనున్న లోకేష్‌ పాదయాత్ర విజయవంతం కావాలని పూజలు చేశారు. గిద్దలూరులో పార్టీశ్రేణులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కడి మాజీ ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. దర్శిలో జరిగిన లోకేష్‌ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పాల్గొన్నారు. అలాగే వైపాలెంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ మన్నె రవీంద్ర తన వైద్యశాల వద్ద కేక్‌ కట్‌ చేశారు. టీడీపీ ఒంగోలు నియోజకవర్గ కార్యాలయంలో లోకేష్‌ పుట్టినరోజు వేడుకల కేక్‌ కటింగ్‌ జరగ్గా టీడీపీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావుతోపాటు పలువురు ఇతర నాయకులు పాల్గొన్నారు. మార్కాపురంలోని చెన్నకేశవ ఆలయంలో లోకేష్‌ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ స్థానిక టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఆలాగే కనిగిరి, పామూరు, వెలిగండ్ల, తాళ్లూరు, ఎస్‌ఎన్‌పాడులతోపాటు పలు ఇతర ప్రాంతాల్లోనూ కేక్‌ కటింగ్‌లు, ఇతర సేవా కార్యక్రమాలతోపాటు దేవాలయాల్లో పూజలను నిర్వహించారు.

Updated Date - 2023-01-24T00:19:33+05:30 IST