Minister Suresh: చట్ట ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డుపై దర్యాప్తు
ABN, First Publish Date - 2023-09-30T21:10:58+05:30
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికే ఆలస్యం జరిగిందని... చట్ట ప్రకారం కేసు దర్యాప్తు జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) వ్యాఖ్యానించారు.
ప్రకాశం: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికే ఆలస్యం జరిగిందని... చట్ట ప్రకారం కేసు దర్యాప్తు జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) వ్యాఖ్యానించారు. శనివారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ అంతర్జాతీయ స్కాంకు చంద్రబాబు, లోకేష్ పాల్పడ్డారు. చంద్రబాబుకు వేలకోట్లు ఉంటే లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఎందుకు నివాసం ఉన్నాడు. అమరావతి పేరుతో బడగు బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో 6,250 కోట్ల మోసం జరిగింది. ఏపీ సీఆర్డీఏ (AP CRDA) పేరుతో మాజీ మంత్రి నారాయణ, చంద్రబాబు , లోకేశ్ భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ స్కాంలో లింగమనేని, హెరిటేజ్, నారాయణ సంస్థలు లబ్ధి పొందాయి. రూపాయి ఖర్చు లేకుండా రింగ్ రోడ్డు ద్వారా దోచుకున్నారు. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ పేరుతో కోట్ల రూపాయలు సింగపూర్ కంపెనీల పేరు చెప్పి ప్రజా ధనం దోచేశారు. రింగ్ రోడ్డు డిక్లేర్ అయ్యాక... వందల ఎకరాలు హెరిటేజ్, నారాయణ సంస్థలు రింగు రోడ్డు పక్కన భూములు కొనుగోలు చేశారు. ఎర్ర బుక్ పట్టుకుని లోకేశ్ ఏదేదో మాట్లాడాడు. ఇప్పుడు సీఐడీ నోటీస్‌లకు భయపడుతున్నాడు’’ అని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.
Updated Date - 2023-09-30T21:10:58+05:30 IST