Yanamala : వామ్మో.. షాకింగ్ విషయాలు చెప్పిన యనమల
ABN , First Publish Date - 2023-03-27T13:03:46+05:30 IST
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు షాకింగ్ విషయాలను వెల్లడించారు. రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లు దాటనుందని ఆయన పేర్కొన్నారు.
అమరావతి : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) షాకింగ్ విషయాలను వెల్లడించారు. రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లు దాటనుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.5.50 లక్షల అప్పు భారం ఉంటుందన్నారు. అధిక అప్పుల వల్ల ప్రజలపై భారం పడుతోందన్నారు. ఖర్చులకు ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలన్నారు. బడ్జెట్ (Budget) అప్పు తీర్చేందుకే సరిపోతే ఇంకేం మిగులుతుందన్నారు. రాష్ట్రం అధోగతిపాలైందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. పరిష్కారం కాదని.. జగన్ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోందని యనమల పేర్కొన్నారు.