ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2023-01-23T23:42:27+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు సోమవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు బర్త్‌డే కేక్‌ను కట్ చేసి పంచిపెట్టారు.

(ఆంధ్రజ్యోతి బృందం)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు సోమవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు బర్త్‌డే కేక్‌ను కట్ చేసి పంచిపెట్టారు. ఇచ్ఛాపురం మండలం కొఠారి గ్రామంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం 29, 30 డివిజన్‌లో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పలాసలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, ఎచ్చెర్లలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీప్రభుత్వం చీకటి జీవోలను తీసుకువచ్చిందని విమర్శించారు. ఎన్టీఆర్ ఆశయసాధనకు ‘యువగళం’ పేరుతో లోకేష్ చేపడుతున్నపాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. అయితే ఈ పాదయాత్రను అడ్డు కునేందుకు వైసీపీ నాయకులు చేస్తున్న పన్నాగాలను ప్రజలే తిప్పి కొడతారన్నారు. కార్యక్రమంలో భాగంగా ‘యువగళం’ పోస్టర్లను ఆవిష్కరించారు. వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాల్లో పెద్ద ఎత్తునపార్టీ క్యాడర్ పాల్గొంది.