Pawan Kalyan: డీజీపీ సెల్యూట్‌ చేస్తోంది సీఎంకు కాదు.. ఓ ఖైదీకే

ABN , First Publish Date - 2023-01-12T20:10:18+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై జనసేన అధినేత (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: డీజీపీ సెల్యూట్‌ చేస్తోంది సీఎంకు కాదు.. ఓ ఖైదీకే

డీజీపీ (DGP) సెల్యూట్‌ చేస్తోంది కూడా సీఎంకు (CM) కాదు.. ఓ ఖైదీకే.

చచ్చు తెలివితేటలు ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే ఉంటాయి.

ఏపీలో జగన్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధేంటి?

నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు

వైఎస్‌ఆర్‌నే (YSR) ఎదుర్కొన్నా.. నువ్వెంత?

రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే కుట్రలు

అంబటి పిచ్చి కూతలు మానుకుని.. తన పని తాను చూసుకోవాలి

రణస్థలం, (శ్రీకాకుళం): ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) జనసేన అధినేత (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైదీ నెంబర్‌ 6093 కూడా తనను విమర్శిస్తారా?, డీజీపీ (DGP) సెల్యూట్‌ చేస్తోంది కూడా సీఎంకు (CM) కాదు.. ఓ ఖైదీకే అని పవన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే కుట్రలు జరుగుతున్నాయని, తనపై ఇంటెలిజెన్స్‌ పెట్టి వేస్ట్‌.. తనను అడిగితే తానే చెబుతా కదా అని, సలహాలు ఇచ్చేవారు సజ్జల అయితే.. సర్వనాశనమే అని పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చచ్చు తెలివితేటలు ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే (Sajjala Ramakrishna Reddy) ఉంటాయని పవన్‌ కల్యాణ్ విమర్శించారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధేంటి?, అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు తప్ప ఏం ఉంది? అని పవన్‌ ప్రశ్నించారు. ఇది మూడు ముక్కల ప్రభుత్వం, మూడు ముక్కల ముఖ్యమంత్రి అని విమర్శించారు. ఏపీలో మూడు ముక్కల ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని, మాట్లాడితే మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడని అంటున్నారని, వైసీపీది (YCP) కాయ్‌ రాజా కాయ్‌ బ్యాచ్‌ అని పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ నాన్న వైఎస్‌ఆర్‌నే (YSR) ఎదుర్కొన్నా.. నువ్వెంత? అని పవన్‌ మండిపడ్డారు. తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని, అలాంటి వాటినే ఎదుర్కొన్నా.. తన ముందు నువ్వెంత? అని పవన్‌ హెచ్చరించారు. తాను బతికున్నంతవరకూ యుద్ధం చేస్తూనే ఉంటానని, తాను ఏ ఒక్క కులానికో చెందిన వాడిని కాదని పవన్‌ అన్నారు. ప్రజల కోసమే రాజకీయాల్లోకి (politics) వచ్చానని, కులాల ఐక్యత అంటే కాపు కులం కాదని,.. అందరూ అని, కేవలం ఒక్క కులంతోనే వైసీపీ నిండిపోయిందని పవన్‌ కల్యాణ్ విమర్శించారు. తనకు కులం తన పక్కన నిలబడకపోయినా పర్వాలేదని, ఓడినా పర్వాలేదు.. కానీ కులాల మధ్య చిచ్చుపెట్టనని పవన్‌ స్పష్టం చేశారు. తాను కుల నాయకుడిని కాదురా సన్నాసుల్లారా, అంబటి పిచ్చి కూతలు మానుకుని.. తన పని తాను చూసుకోవాలని పవన్ సూచించారు. తనను మాటలు అంటే మర్చిపోను.. గుర్తుపెట్టుకోండి అని, జైలుకెళ్లిన వారు కూడా తనను విమర్శిస్తే ఎలా? అని పవన్‌ ప్రశ్నించారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు అండగానే ఉంటానని, శ్రీకాకుళం జిల్లా (Srikakulam) రణస్థలం (Ranasthalam) వేదికగా ప్రజలకు హామీ ఇస్తున్నానని జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.

Updated Date - 2023-01-12T20:31:31+05:30 IST