Srikakulam Dist.: మందసలో ఉద్రిక్తత..
ABN , First Publish Date - 2023-05-09T16:29:55+05:30 IST
శ్రీకాకుళం జిల్లా: మందసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ (TDP) సానుభూతిపరుల షాపులను అధికారులు తొలగించారు.
శ్రీకాకుళం జిల్లా: మందసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ (TDP) సానుభూతిపరుల షాపులను అధికారులు తొలగించారు. దేవాదాయశాఖ భూముల్లో అక్రమంగా షాపులు నిర్వహించారంటూ అధికారులు తొలగింపుకు సిద్ధమవడంతో వివాదం నెలకొంది. అధికారుల తీరుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ (Ex MLA Goutu Shivaji) ఆందోళన చేపట్టారు. స్థానిక టీడీపీ నేత ప్రకాష్ (Prakash), పాణిగ్రహి (Panigrahi) పదేళ్ల క్రితం విష్ణు ఆలయం సమీపంలో దుకాణాలు నిర్మించారు. నాటి నుంచి దేవాదాయ శాఖకు పన్నులు చెల్లిస్తున్నారు. దీనిపై గతంలో వివాదం చెలరేగడంతో కోర్టు స్టే (Stay the Court) ఇచ్చింది.
అయితే మంత్రి అప్పలరాజు (Minister Appala Raju) మాత్రం టీడీపీ సానుభూతిపరుల షాపులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆలయం వద్ద ఇరు పార్టీల నేతలు బాహా బాహికి దిగారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నడుమ అధికారులు మరో టీడీపీ కార్యకర్త ఇంటి ముందు షెడ్డు తొలగించారు. మంత్రి అప్పలరాజు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేతలు (TDP Leaders) మండిపడుతున్నారు.