TDP: అక్రమంగా ఫారం7 దరఖాస్తు చేసిన వైసీపీ నేతలపై చర్యలకు టీడీపీ డిమాండ్
ABN , First Publish Date - 2023-11-15T16:57:04+05:30 IST
నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో నేలపై టీడీపీ నేతలు బైఠాయించారు. ఫారం7 దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుల డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా ఫారం 7 దరఖాస్తు చేసిన వారు ఎదుట ఉన్నా అధికారులు స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

గుంటూరు జిల్లా: నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో నేలపై టీడీపీ నేతలు బైఠాయించారు. ఫారం7 దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుల డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా ఫారం 7 దరఖాస్తు చేసిన వారు ఎదుట ఉన్నా అధికారులు స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఓటర్లు తమ ఓట్లు తొలగించేందుకు ఫారం7 పెట్టారని అధికారులకు టీడీపీ నేతలు విన్నపం చేశారు. అక్రమంగా ఫారం7 దరఖాస్తు చేసిన వైసీపీ నాయకులకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దొంగ ఓట్లపై తక్షణం చర్యలకు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లోనే టీడీపీ నేతలు బైఠాయించారు.