Ayyanna Patrudu: మోదీకి కొడుకు పుడితే జగన్ ముద్దు పెట్టుకుంటాడా?.. అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-08-22T22:13:11+05:30 IST
‘జగన్ సైకో నా కొడుకు. ఆరు నెలల్లో సమాధి కావడం ఖాయం’ అంటూ జగన్‌పై ఏపీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఘాటు విమర్శలు గుప్పించారు.
‘జగన్ సైకో నా కొడుకు. ఆరు నెలల్లో సమాధి కావడం ఖాయం’ అంటూ జగన్‌పై ఏపీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఘాటు విమర్శలు గుప్పించారు. కేంద్ర నిధులతో జగన్ ఇళ్లను నిర్మిస్తున్నారని, మోదీకి కొడుకు పుడితే జగన్ ముద్దు పెట్టుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ చిన్న దొంగ కాదని, చాలా పెద్ద దొంగ అని అన్నారు. జగన్ అర్థిక ఉగ్రవాదని, ధన పిశాచని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద సీబీఐ 13, ఈడీ 9, ఇతర కేసులు 9 ఉన్నాయని అయ్యన్నపాత్రుడు చెప్పారు. ‘‘ఏయ్ జగన్ ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా.. ఇప్పుడు చేయ్. జగన్ ఆరు కిలో మీటర్లకు కూడా హెలీకాప్టరులో వెళ్లాడు. జగన్ పాదయాత్ర చేస్తే మగాళ్లు కాదు. ఆడాళ్లే కొడతారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. 18 సార్లు జగన్ ఢిల్లీకి వెళ్లి ఏం చేశాడు. మోదీ గదిలోకి వెళ్లి జగన్ ఏం చేస్తున్నాడు? ప్రత్యేక హోదా అడుగుతున్నాడా? లేక పిసికేస్తున్నాడా?’’ అంటూ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.
‘‘పోలవరం ప్రాజెక్టు ఏం చేశారురా నా కొడకల్లారా? సీఎం ఓ నత్తి నా కొడుకు. రాజమహేంద్రవరం అని కూడా పలకలేడు. ముసలి వాళ్లని, భర్త పోయిన ఆడవాళ్లను మోసం చేసిన దుర్మార్గపు నా కొడుకు జగన్. వైన్ షాపుల్లేకుండా చేస్తానని, వైన్ షాపుల మీదే అప్పులు చేశాడు. వీడు ఆరు నెలల్లో జైలుకెళ్తాడు. మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లకు తనాఖా పెడతాడా? కేంద్ర నిధులతో ఇళ్లను నిర్మిస్తున్నారు. మోదీకి కొడుకు పుడితే వీడు ముద్దు పెట్టుకుంటాడా?’’ అని అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరంలో మాజీ మంత్రి అనిల్ నీళ్లు పారిస్తాన్నన్నారని, కానీ ప్రస్తుతం నీళ్లు లేవని, ఆయన కూడా లేరని అన్నారు. ఇక మంత్రి అంబటిని పోలవరం సంగతి చెప్పమంటే అరగంట చాలంటాడని, అరగంటలో ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక ‘‘రింగుల రాణి రోజా. టూరిజం సంగతి ఏంటమ్మా అంటే నా సొగసు చూడు మాయ్యా అంటుంది.’’ అని అయ్యన్నపాత్రుడు అన్నారు.