Varla Ramaiah: ఆ సుపారీ డబ్బు ఎవరిచ్చారో జగన్ చెప్పాలి
ABN, First Publish Date - 2023-01-31T17:57:55+05:30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Cm JaganMohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Cm JaganMohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు. వివేకా హత్య కేసు (Viveka murder case)లో వైఎస్సార్ (YSR) తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) వ్యాఖ్యలపై జగన్ స్పందించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
వివేకా హత్యకేసులో సీబీఐ నోటీసులిచ్చిన నవీన్ (Naveen) ఎవరు?, హత్య జరిగిన రోజు అవినాష్‌రెడ్డి (Avinash Reddy) ఫోన్‌లో మిషన్ కంప్లీట్ అని చెప్పారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. సీబీఐ (CBI) నుంచి రక్షణ కోసమే జగన్ ఢిల్లీ (Delhi) పర్యటననా? అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. అంతా బయటపడిన తర్వాత నిజం దాచటం మంచిది కాదని జగన్‌రెడ్డికి వర్ల రామయ్య సూచించారు. రూ.40 కోట్ల సుపారీ ఇచ్చే స్థోమత అవినాష్‌రెడ్డికి లేదని, ఆ సుపారీ డబ్బు ఎవరిచ్చారో సీఎం జగన్‌రెడ్డి చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
ఇటీవల వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిమానాన్ని పొందిన అంత పెద్ద నాయకుడి కేసు విచారణకు ఇంకా ఎన్నాళ్లు పడుతుందని ఆమె ప్రశ్నించారు. కేసు విచారణ త్వరగా తేలకపోతే సీబీఐ (CBI)పై ప్రజలకు ఉన్న నమ్మకం పోతుందని షర్మిల అన్నారు. వివేకా హత్యకేసు విచారణలో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది.
Updated Date - 2023-01-31T18:06:41+05:30 IST