YSR Ghat: వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళి.. ఈ సారి సాంప్రదాయ ఆచారాలను పక్కన పెట్టాడని..
ABN , First Publish Date - 2023-07-08T17:16:36+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) కడప జిల్లా (Kadapa) ఇడుపులపాయకు (Idupulapaya) చేరుకున్నారు.
కడప: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) కడప జిల్లా (Kadapa) ఇడుపులపాయకు (Idupulapaya) చేరుకున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) 74వ జయంతి సందర్బంగా ఇడుపులపాయలో ఉన్న వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. వైఎస్ ఘాట్‌లో జగన్ వెంట తల్లి విజయమ్మ ప్రార్ధనల్లో పాల్గొన్నారు.
షెడ్యూల్ ప్రకారం 2 గంటలకు రావాల్సి ఉండగా 2.30 గంటలు ఆలస్యంగా జగన్ ఇడుపులపాయకు వచ్చారు. వైఎస్ మరణానంతరం తొలిసారిగా జయంతి కార్యక్రమంలో సాయంత్రం ప్రార్ధనలు చేశారు. చెల్లెలు షర్మిళపై విభేదాలతోనే ఈ సారి సాంప్రదాయ ఆచారాలను జగన్ రెడ్డి పక్కన పెట్టాడని జనంలో వాదనలు వినిపిస్తోన్నాయి.