26 నుంచి ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 400 బుకింగ్స్
ABN , First Publish Date - 2023-01-17T03:29:14+05:30 IST
తాము ఇటీవల రూ.15.99 లక్షల పరిచయ ధరతో విడుదల చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 400ను తొలి ఏడాది...

తాము ఇటీవల రూ.15.99 లక్షల పరిచయ ధరతో విడుదల చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 400ను తొలి ఏడాది 20 వేల యూనిట్ల వరకు డెలివరీ చేయగలమని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఈ నెల 26 నుంచి ఈ కారు బుకింగ్స్ ప్రారంభమవుతాయని, ఈఎల్ వేరియెంట్ డెలివరీ మార్చి నుంచి ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. ఇందులోనే ఈసీ వేరియెంట్ డెలివరీ దీపావళి నాటికి ప్రారంభమవుతుందని తెలిపింది. 34.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ కారు ఒకసారి చార్జింగ్ చేస్తే 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.