Big Relief For LPG Customers: వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త...నేటి నుంచి సిలిండర్ ధర రూ.92 తగ్గింపు
ABN , First Publish Date - 2023-04-01T07:52:15+05:30 IST
దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు శుభవార్త...
న్యూఢిల్లీ: దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు శుభవార్త.(Big Relief For LPG Customers) కమర్షియల్ గ్యాస్ సిలిండర్(Cylinder Reduced) ధరలను ఏప్రిల్ 1వతేదీ నుంచి 92రూపాయలు తగ్గించారు. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి తగ్గింపు లేదు. మార్చి నెలలో కమర్షియల్ సిలిండర్ల(Commerical gas cylinder) ధరలను రూ.350 మేర కేంద్రం పెంచింది. గతంలో గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం ఇప్పుడు భారీగా తగ్గించింది.ఒక్కో సిలిండరుపై రూ.92లను తగ్గించింది.ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద సబ్సిడీని ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నుంచి ఒక సంవత్సరం పాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. ఈ పథకం కింద గ్రామీణ,వెనుకబడిన పేద కుటుంబాలకు ఎల్పీజీ సిలిండర్ ను 200రూపాయలకే అందిస్తుంది.
వివిధ నగరాల్లో ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ - రూ 2,028
కోల్‌కతా - రూ 2,132
ముంబై - రూ 1,980
చెన్నై - రూ 2,192.50
తగ్గని డొమెస్టిక్ సిలిండర్ ధరలు
దేశంలోని వివిధ నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధరలు తగ్గలేదు. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం దేశంలోని వివిధ నగరాల్లో 14.2 కిలోలు లేదా డొమెస్టిక్ సిలిండర్ ధర కింది విధంగా ఉంది.
ఢిల్లీ - రూ 1,103
ముంబై - రూ 1,102.50
చెన్నై - రూ 1118.50
పాట్నా - రూ 1201
కోల్‌కతా - రూ 1,129
ఐజ్వాల్ - రూ 1,255
అహ్మదాబాద్ - రూ 1,110
భోపాల్ - 1,118.50
జైపూర్ - రూ 1116.50