పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-01-17T00:15:10+05:30 IST
ఎల్లన్న నగర్‌లో పోగు భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపిఐ (ఎంల్) ప్రజాపంఽథా ఆధ్వర్యంలో గ్రామ సమీపంలోని సాగర్ కాల్వలో సోమవారం నిరసన వ్యక్తం చేస్తూ జలదీక్షను చేపాట్టారు.
కొణిజర్ల, జనవరి 16: ఎల్లన్న నగర్‌లో పోగు భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపిఐ (ఎంల్) ప్రజాపంఽథా ఆధ్వర్యంలో గ్రామ సమీపంలోని సాగర్ కాల్వలో సోమవారం నిరసన వ్యక్తం చేస్తూ జలదీక్షను చేపాట్టారు. ముందుగా ఎల్లన్ననగర్‌లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో పోడు సాగుదా రులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. తర్వాత విస్మరించారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆవుల వెంకటేశ్వర్లు, కంకణాల అర్జున్‌రావు, అప్పారావు, సోములు, రాపోలు శ్రీను, లక్ష్మణ్‌బాబు పాల్గొన్నారు.