షాదీఖానాల నిర్మాణాలకు రూ.3.50కోట్ల మంజూరు
ABN , First Publish Date - 2023-01-26T00:44:29+05:30 IST
సత్తుపల్లి నియోజకవర్గంలోని మూడు ఉర్దూ-ఘర్-కమ్-షాదీఖానాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.50కోట్ల నిధులను బుధవారం మంజూరు చేసింది.
సత్తుపల్లి, జనవరి 25: సత్తుపల్లి నియోజకవర్గంలోని మూడు ఉర్దూ-ఘర్-కమ్-షాదీఖానాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.50కోట్ల నిధులను బుధవారం మంజూరు చేసింది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అభ్యర్థన మేరకు సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు మండల కేంద్రాల్లో షాదీఖానాలకు నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ముస్లింలు శుభకార్యాలు జరుపుకునేందుకు షాదీ ఖానాల ఆవశ్యకత ఉందని, వీటికి నిధులు మంజూరు పట్ల సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సత్తుపల్లికి రూ. రెండు కోట్లు, వేంసూరు రూ.75 లక్షలు, కల్లూరు రూ.75లక్షలు మంజూరయినట్టు ఆయన తెలిపారు.
అజ్మీర్‌దర్గా ప్రార్ధనల్లో ఎమ్మెల్యే సండ్ర
ప్రతిఏటా అజ్మీర్ దర్గా ఉర్సూ సందర్భంగా ’చాదర్’ను బుధవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమర్పిం చారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముస్లిం మతపెద్దల సమక్షంలో దైవ ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, వక్ఫ్‌బోర్డు అధికారులతో కలిసి ఎమ్మెల్యే సండ్ర అజ్మీర్ దర్గాకు చాదర్‌ను సమర్పించారు. అల్లాను ప్రార్ధిస్తూ సీఎం కేసీఆర్‌కు నిండనూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
షాదీఖానాకు నిధులు మంజూరు పట్ల హర్షం
కల్లూరు, జనవరి 25: ముస్లిం మైనారిటీలకు గాను నూతనంగా షాదీఖానా నిర్మాణానికి రూ.70 లక్షలు ప్రభుత్వం తరుపున మంజూరు చేయటం పట్ల కల్లూరు మండల ముస్లిం మైనారిటీ నాయకులు హర ్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జామే మసీద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల ముస్లీం కమిటీ అధ్యక్షుడు సయ్యద్‌అలీ, మసీద్ కమిటీ అద్యక్షుడు షేక్ ఇమామ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి ఇస్మాయిల్, ఎస్‌కె కమ్లి, మాజీ సదర్ హనీఫ్‌లు మాట్లాడారు. ఎమ్మెల్యే సండ్రకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మైనారిటీ సెల్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ రవూఫ్, జామాతే ఇస్లాం హింద్ నాయకులు ముజాహిద్, ఇషాక్, యాఖుబ్‌అలీ పాల్గొన్నారు.