వేంకటేశ్వర కల్యాణోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-03-03T23:41:19+05:30 IST

కందుకూరులోని వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు 14వతేదీ నుంచి 19వతేదీ వరకు నిర్వహించనున్నారు.

వేంకటేశ్వర కల్యాణోత్సవాలు ప్రారంభం
ధ్వజారోహణం నిర్వహిస్తున్న అర్చకులు

వేంసూరు, మార్చి 3: కందుకూరులోని వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు 14వతేదీ నుంచి 19వతేదీ వరకు నిర్వహించనున్నారు. 14న సోమవారం ధ్వజారోహణం, 15న ఎదుర్కోలు ఉత్సవం, 16న శ్రీస్వామి కల్యాణ మహోత్సవం, 17న స్వామివారి దివ్య రథోత్సవం, 18న దొంగల దోపోత్సవం, 19న స్వామివారి పవళిం పు సేవ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈవో వీవీ.నర్సింహారావు, చైర్మన్‌ రాయల సత్యనారాయణల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా గ్రామస్థులు మహిళలకు కబడ్డీ పోటీలు, నాలుగు విభాగాల్లో ఎడ్లపోటీలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఘనంగా ప్రారంభమైన కల్యాణోత్సవాలు

వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ధ్వజారోహణం నిర్వహించారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు.

Updated Date - 2023-03-03T23:41:19+05:30 IST