వైరాలో అకాల వర్షం

ABN , First Publish Date - 2023-04-30T23:37:31+05:30 IST

వైరాలో ఆదివారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం సాయంత్రం మూడుగంటల

వైరాలో అకాల వర్షం
ధాన్యం రాసుల పట్టాలపై నిలిచిన వర్షపు నీరు

వైరా, ఏప్రిల్‌ 30: వైరాలో ఆదివారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం సాయంత్రం మూడుగంటల నుంచి దట్టమైన మబ్బులతో ఒక్కసారిగా వర్షం కురిసింది. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేలాది బస్తాల ధాన్యం కల్లాలు, రోడ్లపై ఆరబోసి ఉన్నారు. కాంటా వేసిన ధాన్యం బస్తాలు కూడా రోడ్లపైనే ఉన్నాయి. రైతులు ధాన్యం రాశులపై టార్పాలిన్లు పట్టాలు కప్పారు. వాటిపైన వర్షపునీరు నిలిచింది. మొక్కజొన్న రైతులది కూడా ఇదే పరిస్థితి. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Updated Date - 2023-04-30T23:37:31+05:30 IST