నవ్విపోదురుగాక..
ABN , First Publish Date - 2023-07-15T23:28:50+05:30 IST
వైరా మునిసిపల్ పాలకవర్గం వ్యవహరిస్తున్న తీరు నవ్విపోదురుగాక నాకేంటి అనే చందంలా ఉందనే విమర్శలు విన్పిస్తున్నా యి.

వైరా, జూలై 15: వైరా మునిసిపల్ పాలకవర్గం వ్యవహరిస్తున్న తీరు నవ్విపోదురుగాక నాకేంటి అనే చందంలా ఉందనే విమర్శలు విన్పిస్తున్నా యి. ఈ మునిసిపాలిటీలో ఏడునెలల నుంచి జరుగుతున్న వివిధ పరిణామాల నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో జరిగిన సంఘటనలు దీనికి ఊతమిస్తున్నాయి. శుక్రవారం మునిసిపల్ సమావేశం జరుగకుండానే పది అంశాలతో ఉన్న ఎజెండాను ఆమోదించినట్లు తీర్మానించేందుకు చేసిన ప్రయత్నాలను కొంతమంది కౌన్సిలర్లు అడ్డుకున్నా రు. శనివారం మునిసిపాలిటీలోని ఇద్దరు సిబ్బంది తీర్మా నాలను ఆమోదించినట్లు సంతకాల కోసం కొంతమంది కౌన్సిలర్ల వద్దకు వెళ్లారు. దీంతో కౌన్సిలర్లు సిబ్బందిని నిల దీశారు. తమ దగ్గరకు తీసుకువచ్చిన సమావేశ ఎజెండా తీర్మాన ప్రతులను కౌన్సిలర్లు స్వాధీ నం చేసుకొని వెంటనే కమిషనర్‌ను నిలదీశారు. ఆతర్వాత ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే మధుసూదన్ వైరా వచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో 15మంది కౌన్సిలర్లు, కమిషనర్‌తో ఈ వివాదంపై అనధికారిక సమావేశాన్ని నిర్వహిం చి నిలదీశారు.సమావేశం లేకుండా తీర్మానాలను ఆమోదించినట్లు ఇళ్లకు వెళ్లి కౌన్సిలర్ల సంత కాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటని కమిషనర్‌ను ఎమ్మెల్సీ ప్రశ్నించారు.
ఆశ్చర్యకరంగా పరిణామాలు
శుక్రవారం జరిగిన పరిణామాలు ఆశ్చర్యకరంగా ఉన్నా యి. 14న 10.30 గంటలకు పురపాలక సంఘ కార్యాల యంలో ఎజెండాలో పొందుపర్చిన ప్రస్తావనాలపై చర్చిం చి తీర్మానాలు ఆమో దించేందుకు ప్రత్యేక సమావేశం ఏ ర్పాటు చేశామని నోటీసులు ఆ రోజు సాయంత్రం కౌ న్సిలర్ల వద్దకు సిబ్బంది తీసుకువెళ్లారు. వైరా ము నిసిపాలిటీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మం జూరై టెండర్లు పిలిచిన రూ.30కోట్ల నిధుల ఖర్చు అలాగే పదిశాతం గ్రీన్‌బెల్డ్ కింద రూ. 62.47 లక్షల మునిసిపల్ సాధారణ నిధులు వినియోగించటం సహా పది అం శాలతో ఉన్న తీర్మానాలను శుక్రవారం ఆమోదించినట్లు చైర్మన్, వైస్‌చైర్మన్ సూతకాని జైపాల్, ముళ్లపాటి సీతారా ములతోపాటు 6, 8, 9, 10, 14, 15, 16, 19, 20 వార్డుల కౌన్సిలర్లతో పాటు ఇద్దరు కోఆప్షన్ సభ్యులు సంతకాలు చేశారు. అయితే శనివారం మిగిలిన కౌన్సిలర్ల సంతకాల కోసం మునిసిపాలిటీ సిబ్బంది వెళ్లగా వారు నిలదీయ డంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి అభాసుపాలైంది. చివరికి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ జోక్యం చేసుకొని ప్రొసిజర్ ప్రకారం కౌన్సిలర్లందరికి సమావేశ నోటీసులు ఇచ్చి సమావేశాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. చివరి కి ఈనెల 18న సమావేశం నిర్వహించేందుకు కమిషనర్ సిద్ధమవుతున్నారు.