రైల్వే బోర్డు చైర్మన్‌గా అనిల్‌ లాహోటి

ABN , First Publish Date - 2023-01-02T02:19:29+05:30 IST

రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈఓగా అనిల్‌ కుమార్‌ లాహోటి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. కేబినెట్‌ నియామకాల కమిటీ ఆయన నియామకాన్ని

రైల్వే బోర్డు చైర్మన్‌గా అనిల్‌ లాహోటి

సికింద్రాబాద్‌/న్యూఢిల్లీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈఓగా అనిల్‌ కుమార్‌ లాహోటి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. కేబినెట్‌ నియామకాల కమిటీ ఆయన నియామకాన్ని ఆమోదించింది. అంతకు ముందు ఆయన రైల్వే బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 1984 బ్యాచ్‌కు చెందిన ఆయన, ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీ్‌సలో పనిచేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మాధవ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అనిల్‌, ఐఐటీ రూర్కీలో పీజీ పూర్తి చేశారు. రైల్వే ఆదాయాన్ని పెంచేందుకు కిసాన్‌ రైళ్లను అత్యధిక సంఖ్యలో నడిపించిన ఘనత ఆయన సొంతం.

Updated Date - 2023-01-02T02:19:29+05:30 IST