ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP Vs BRS: కౌంటర్ దీక్షలతో హస్తినతో పాటు తెలంగాణలోనూ ఉత్కంఠ

ABN, First Publish Date - 2023-03-09T18:28:05+05:30

కవిత (BRS MLC K Kavitha) చేస్తున్న నిరాహార దీక్షకు తెలంగాణ బీజేపీ కౌంటర్ దీక్షకు రెడీ అయింది.

BJP Vs BRS
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ/హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill) కోసం హస్తిన(Delhi) జంతర్‌ మంతర్(Jantar Mantar) దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC K Kavitha) చేస్తున్న నిరాహార దీక్షకు తెలంగాణ బీజేపీ కౌంటర్ దీక్షకు రెడీ అయింది. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మహిళా గోస బీజేపీ భరోసా పేరుతో కౌంటర్ దీక్ష చేయనున్నారు. బెల్ట్‌షాపులు, మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ బీజేపీ దీక్ష చేపట్టనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దీక్ష కొనసాగుతుందని బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు తెలిపారు.

మరోవైపు హస్తినలో కవిత దీక్షకు జంతర్ మంతర్ వేదిక ఖరారు కాగా లిక్కర్ స్కామ్‌(Delhi liquor scam)కు వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ నేతలు చేయాలనుకున్న ధర్నా జంతర్‌మంతర్ నుంచి దీన్‌దయాళ్‌ మార్గ్‌కు మారింది. దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని ఆంధ్రా స్కూల్‌ దగ్గర బీజేపీ ధర్నా నిర్వహించనుంది. దీంతో రేపు ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు నిర్వహించనున్నాయి.

అంతకు ముందు ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన కవిత చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం జరుగుతోందని చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళాబిల్లు ఆమోదం పొందలేదన్నారు. 2014, 2018 మహిళా బిల్లుపై బీజేపీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మహిళా బిల్లును కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టారని విమర్శించారు. మహిళా బిల్లు ఆమోదం కోసం ఈ నెల 10న ఢిల్లీలో నిరాహార దీక్ష చేపడతానని, రేపటి ధర్నాలో 18 పార్టీలు పాల్గొంటాయని ఆమె చెప్పారు. పూర్తి మెజార్టీతో గెలిపించినా మహిళా బిల్లుపై బీజేపీ మాట తప్పిందని, మహిళా బిల్లుపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తేవడంలో సోనియా పాత్ర అమోఘమని కవిత చెప్పారు.

మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi liquor scam)తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC K Kavitha) తెలంగాణ పరువు తీశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌పై అన్నా చెల్లెలు (KTR, Kavitha) ఇద్దరూ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన కేటీఆర్, కవితలను ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్‌ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ నేతలను మించినవారు లేరని కిషన్‌రెడ్డి చెప్పారు. ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి లిక్కర్‌ స్కామ్‌ చేయాలని చెప్పామా అంటూ ఆయన కేటీఆర్, కవిత(KTR, Kavitha)లను ఉద్దేశించి ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు కల్వకుంట్ల ఫ్యామిలీకి లేదన్నారు. లిక్కర్‌ స్కామ్‌పై దృష్టి మళ్లించేందుకే ఢిల్లీలో ధర్నా నాటకాలు ఆడుతున్నారని, సానుభూతి కోసమే బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని కిషన్ రెడ్డి చెప్పారు.

మద్యం కేసు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తుకొచ్చిందా అని కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ కవితను ఎద్దేవా చేశారు. తప్పు చేయకపోతే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. లక్షల విలువైన సెల్‌ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్, కవిత, బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేయాల్సినంత గొప్పవాళ్లు కాదని కిషన్ రెడ్డి చెప్పారు. అక్రమ వ్యాపారంలో ఇరుక్కుపోయి, అక్రమాలు చేస్తూ మోదీని తప్పుపడతారా అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-03-09T18:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising