ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress 1st list: ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.. ఎవరెవరికి టికెట్లు దక్కాయంటే..?

ABN, First Publish Date - 2023-10-15T12:05:51+05:30

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్‌, తెలంగాణ రాష్ట్రాలకు గాను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో మొదటి జాబితాలో భాగంగా 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్‌, తెలంగాణ రాష్ట్రాలకు గాను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మొదటి జాబితాలో మధ్యప్రదేశ్‌లో 144 స్థానాలకు, ఛత్తీస్‌ఘఢ్‌లో 30 స్థానాలకు, తెలంగాణలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో మొదటి జాబితాలో భాగంగా 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొదటి జాబితా ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ చింద్వారా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చచౌరా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. రఘోగఢ్ స్థానం నుంచి మాజీ సీఎం కుమారుడు జైవర్ధన్ సింగ్ బరిలోకి దిగారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పోటీ చేస్తున్న బుధ్ని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా విక్రమ్‌ మస్తాల్‌ను పోటీకి దింపింది. చుర్హాట్ నుంచి అజయ్ సింగ్ రాహుల్, రౌ నుంచి జితు పట్వారీ, అతేర్ నుంచి హేమంత్ కటారే, ఝబువా నుంచి విక్రాంత్ భూరియాలను కాంగ్రెస్ పోటీకి దింపింది. తొలి జాబితాలో 30 ఎస్టీ కమ్యూనిటీ నియోజకవర్గాలకు, 22 ఎస్సీ సామాజికవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 17న ఒకే దశలో జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటిస్తారు.


ఇక 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌ఘఢ్‌ విషయానికొస్తే.. తమ తొలి జాబితాలో భాగంగా 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో డిప్యూటీ సీఎం టీఎస్‌ సింగ్‌ డియో తన కంచుకోట అయిన అంబికాపూర్‌ నుంచి బరిలో నిలిచారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పటాన్ నుంచి పోటీ చేయనున్నారు. సీఎం బఘెల్ 2003 నుంచి పటాన్‌ నియోకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేశారు. ఆయన పటాన్ నియోజకవర్గంలో తన మేనల్లుడు, బీజేపీ నేత విజయ్ బాగెల్‌తో తలపడనున్నారు. అమర్జీత్ భగత్ మరోసారి సీతాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. కాగా సీతాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమర్జీత్ భగత్ నాలుగుసార్లు గెలిచారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రకటించిన 30 మంది అభ్యర్థుల్లో 14 మంది ఎస్టీ వర్గానికి చెందిన వారున్నారు. అంతేకాకుండా ఈ మొదటి జాబితాలో ముగ్గురు మహిళలకు కూడా టికెట్లు ఇచ్చారు. అయితే స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పలువురు సిట్టింగ్ అభ్యర్థులకు మరోసారి టికెట్లు ఇచ్చారని తెలుస్తోంది. కాగా ఛత్తీస్‌ఘఢ్‌లో రెండు దశలో నవంబర్ 7, నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Updated Date - 2023-10-15T12:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising