Tsunami warning: సుమత్రా దీవుల్లో భారీ భూకంపం...సునామీ హెచ్చరిక...సురక్షిత ప్రాంతాలకు సముద్ర తీరప్రాంతవాసుల తరలింపు

ABN , First Publish Date - 2023-04-25T07:05:31+05:30 IST

ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది....

Tsunami warning: సుమత్రా దీవుల్లో భారీ భూకంపం...సునామీ హెచ్చరిక...సురక్షిత ప్రాంతాలకు సముద్ర తీరప్రాంతవాసుల తరలింపు
Sumatra Island Tsunami warning

సుమత్రా దీవులు(ఇండోనేషియా): ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది.(Indonesia) ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపానికి(Sumatra Island) పశ్చిమాన మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. ఈ భూకంపంతో(Earthquake) ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) సునామీ హెచ్చరికను జారీ చేసింది.(Tsunami warning) ఇండోనేషియాలో గతంలోనూ 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంపం 84 కిలోమీటర్ల లోతులో వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు.

సునామీ హెచ్చరికలతో సుమత్రా దీవుల్లో తీరప్రాంత వాసులు సముద్ర తీరానికి దూరంగా ఉండాలని ఇండోనేషియా అధికారులు కోరారు. పశ్చిమ సుమత్రా రాజధాని పడాంగ్‌లో భూకంపం తీవ్రంగా ఉందని, దీంతో ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉన్నారని పడాంగ్‌లో ఉన్న అధికార ప్రతినిధి అబ్దుల్ ముహారి చెప్పారు.సునామీ ముప్పుతో సముద్ర తీరప్రాంత వాసులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.

కొంతమంది పడాంగ్ సముద్రతీర నివాసితులను మోటర్‌బైక్ లపై, కాలినడకన ఎత్తైన ప్రదేశానికి తరలించారు. కొందరు బ్యాక్‌ప్యాక్‌లను వెంట తీసుకువెళ్లారు. మరికొందరు గొడుగులతో సముద్రానికి దూరంగా వెళ్లారు.సిబెరుట్ ద్వీప వాసులు ఇప్పటికే ఖాళీ చేశారు.పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలిచే భూకంప జోన్ అయిన ఇండోనేషియాలో తరచూ భూకంపాలు వస్తున్నాయి.

Updated Date - 2023-04-25T07:29:37+05:30 IST